28, ఫిబ్రవరి 2018, బుధవారం

నడిచి రావాలి ప్రతి రోజు ఉదయం ఆరోగ్యం కోసం

నడిచి రావాలి ప్రతి రోజు ఉదయం ఆరోగ్యం కోసం
నడిచి పోవాలి ప్రతి రోజు సాయంత్రం ఆనందం కోసం

నడవడమే జీవిత లక్ష్యమని ప్రతి రోజు ఆయుస్సుకై నడవాలి  || నడిచి ||

ఉదయించుటలో ఉన్నది సూర్య తేజ శక్తి ప్రభావ స్వరూపం
అస్తమించుటలో ఉన్నది సూర్య కిరణ శక్తి ప్రభాత సందేశం 

సూర్యోదయమే మేధాశక్తికి అనంత కార్యాల ఉత్తేజం
సూర్యాస్తమమే దేహశక్తికి ఆనంద కార్యాల ప్రశాంతం   || నడిచి ||

ప్రకృతిలోనే దేహాశక్తి పరిశోధనం జీవశక్తి ప్రభావం
ప్రకృతిలోనే దైవశక్తి పరిపూర్ణం జీర్ణశక్తి ప్రమేయం

నడిచేవేళ నవ నాడుల చలనం ఆరోగ్యానికి ఔషధం
నడిచేవేళ నవ రంధ్రాల చలనం ఆరోగ్యానికి ఔన్నత్యం  || నడిచి || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion