17, నవంబర్ 2018, శనివారం

కనిపించదు కలలకు దూరం

కనిపించదు కలలకు దూరం
వినిపించదు ఊహలకు శబ్దం

మరణించదు మనస్సుకు మౌనం
జన్మించదు వయస్సుకు స్వప్నం

జీవించుటలో తెలియదు ఎవరికి కథనం
ఎదుగుటలో తోచదు ఎందరికో నిపుణం   || కనిపించదు ||

ప్రతిబింబం కనిపించని విధమే
పరస్పరం అన్పించని బంధమే

అతిశయం దొరికినా అల్పమే
పరిణయం గడిచినా లోపమే   || కనిపించదు ||

సమయం ఊహించినా కల్పితమే
ప్రయాణం ఊరించినా ఉద్రేకమే

మోహనం బంధాలకు నయనమే
సోయగం మెరుపులకు ఆ'భరణమే   || కనిపించదు || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి