23, నవంబర్ 2018, శుక్రవారం

నా మేధస్సులోనే ఏమున్నదో

నా మేధస్సులోనే ఏమున్నదో
నా ఆలోచనలోనే ఏమున్నదో

మేధస్సులోనే సర్వం ఆలోచిస్తున్నది
మేధస్సులోనే నిత్యం ఆలోచిస్తున్నది

మేధస్సు ఎంతటిదో భావాల ఆలోచనలను ఊటగా ఊరిస్తున్నది  || నా మేధస్సులోనే ||

మేధస్సులోని భావాలతోనే ఆలోచిస్తున్నా
మేధస్సులోని తత్వాలతోనే ఆలోచిస్తున్నా

మేధస్సులోని కణాలతోనే ఆలోచిస్తున్నా
మేధస్సులోని గుణాలతోనే ఆలోచిస్తున్నా

మేధస్సే మధురం మధురం మహా మధురం
మధురాతి మధురాల మహా మధుర అతిశయం  || నా మేధస్సులోనే ||

మేధస్సులోనే ప్రతి కార్యం ఆలోచిస్తున్నా
మేధస్సులోనే ప్రతి జ్ఞానం ఆలోచిస్తున్నా

మేధస్సులోనే ప్రతి గమనం ఆలోచిస్తున్నా
మేధస్సులోనే ప్రతి చలనం ఆలోచిస్తున్నా

మేధస్సే మధురం మధురం మహా మధురం
మధురాతి మధురాల మహా మధుర మకరందం  || నా మేధస్సులోనే ||   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి