17, ఏప్రిల్ 2019, బుధవారం

సరిగమలు పలికెదవా పదనిసలు పిలిచెదవా

సరిగమలు పలికెదవా పదనిసలు పిలిచెదవా
సంగీతం పాడెదవా స్వరములను తెలిపెదవా

గమకాల గాన గాంధర్వ గీతములనే శృతించెదవా   || సరిగమలు ||

వేణువుగా శృతించి వేదాలనే పలికెదవా
దరువుగా మెప్పించి చరణాలనే పాడెదవా

తనువుతో శ్వాసించి గేయములనే తలిచెదనా
అరువుతో ధ్యానించి గీతములను తెలిపెదనా    || సరిగమలు ||

చనువుతో అర్పించి స్వరములనే కొలిచెదనా
గురువుతో ఒప్పించి కంఠములనే ఆర్జించెదనా

సత్తువుతో నేర్పించి శృతులనే చేర్చేచెదనా
మధువుతో గర్వించి గానములనే కలిపెదనా   || సరిగమలు || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి