17, ఏప్రిల్ 2019, బుధవారం

ఆలోచన లేదా రాదా నీ మేధస్సులో

ఆలోచన లేదా రాదా నీ మేధస్సులో
ఆలోచన చేయవా తోచదా నీ మేధస్సులో

ఆలోచన కలుగదా ఎదగదా నీ మేధస్సులో
ఆలోచన తెలుపవా తలచవా నీ మేధస్సులో

ఆలోచన లేని నీ మేధస్సు మహా సుకుమారమా  || ఆలోచన ||

ఆలోచనలను అర్థం చేసుకోవా
అర్థాన్నే ఆలోచనగా మార్చుకోవా

అనేక భావాల ఆలోచనలనే గ్రహించవా
అనంత తత్వాల ఆలోచనలనే గమనించవా  || ఆలోచన ||

మహోన్నత ఆలోచనలనే తిలకించలేవా
మహత్తరమైన ఆలోచనలనే పరిశోధించవా

ఆలోచనలనే అనుభవాల అర్థాలుగా మార్చుకోవా
ఆలోచనలనే అనుబంధాల పరమార్థంగా చూసుకోవా  || ఆలోచన ||

ఉపయోగమైన ఆలోచనలనే దాచుకోవా
నిరుపయోగమైన ఆలోచనలనే వదులుకోవా

మేధస్సునే అనంతమైన ఆలోచనలతో నింపుకోవా
మేధస్సునే సుందరమైన ఆలోచనలతో ఉంచుకోవా   || ఆలోచన ||

ఆలోచనలనే ఉపయోగిస్తూ ఐశ్వర్యమే చేసుకోవా
ఆలోచనలనే వినియోగిస్తూ అదృష్టమే చేర్చుకోవా

ఆలోచనలనే అద్భుతంగా మళ్ళించుకోవా
ఆలోచనలనే ఆశ్చర్యంగా మరిపించుకోవా    || ఆలోచన || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి