28, జూన్ 2019, శుక్రవారం

ఎవరూ గ్రహించలేరా నా భావాల వేదాలను

ఎవరూ గ్రహించలేరా నా భావాల వేదాలను
ఎవరూ స్మరించలేరా నా తత్వాల నాదాలను

ఎవరూ పలికించలేరా నా గమన గీతాలను
ఎవరూ లిఖించలేరా నా చలన స్వరాలను

శృతించుటలో నా భావ వేద తత్వ నాదాలు సరిగమల సాహిత్యాన్ని శుద్దిస్తున్నాయి  || ఎవరూ ||

నా భావాలు పరిశోధనలోనే సాగుతూ పరిభ్రమిస్తున్నాయి
నా తత్వాలు పర్యవేక్షణలోనే సాగుతూ పరిశ్రమిస్తున్నాయి

నా గమనాలు పరిశుద్ధంలోనే ఆడుతూ పరిమితమౌతున్నాయి
నా చలనాలు పరిపూర్ణంలోనే ఆడుతూ పవిత్రమౌతున్నాయి   || ఎవరూ ||

నా వేదాలు పర్యావరణంలోనే సాగుతూ ప్రశాంతమౌతున్నాయి
నా నాదాలు ప్రపంచంలోనే సాగుతూ ప్రాచుర్యమౌతున్నాయి

నా గీతాలు పల్లవించుటలోనే ఆడుతూ ప్రౌఢత్వమౌతున్నాయి
నా రాగాలు పరితపించుటలోనే ఆడుతూ ప్రభాతమౌతున్నాయి  || ఎవరూ || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి