17, డిసెంబర్ 2019, మంగళవారం

మేధస్సులో ఆలోచనల మర్మం కుబేరం

మేధస్సులో ఆలోచనల మర్మం కుబేరం
మనస్సులో యోచనల మంత్రం అపారం

దేహస్సులో ప్రక్రియల యంత్రం నిక్షిప్తం
వయస్సులో సులోచనల తంత్రం రక్షితం

జీవుల రూపాకారం సృస్థించుటలోనే మాతృత్వం
జీవుల అలంకారం జీవించుటలోనే జ్ఞానేత్రత్వం  || మేధస్సులో ||

యోచనల మనస్సే భావం
ప్రక్రియల దేహస్సే నాదం
ఆలోచనల మేధస్సే వేదం
సులోచనల వయస్సే తత్వం

జీవించుటలో తెలియనివి అనంతం
స్మరించుటలో తెలిసినవి అమోఘం 

గమనించుటలో తెలియనివి అధికం
తపించుటలో తెలిసినవి అపూర్వం   || మేధస్సులో ||

యోచనల ఉషస్సే కార్యం
ప్రక్రియల ఆయుస్సే లోకం
ఆలోచనల వచస్సే జ్ఞానం
సులోచనల తేజస్సే యోగం

జీవించుటలో తెలియనివి అసంఖ్యం 
స్మరించుటలో తెలిసినవి అఖండం 

గమనించుటలో తెలియనివి అనేకం
తపించుటలో తెలిసినవి అమరం    || మేధస్సులో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి