13, డిసెంబర్ 2019, శుక్రవారం

సమయమా సాగవా తరుణమా వ్యాపించవా

సమయమా సాగవా తరుణమా వ్యాపించవా 
కాలమా ప్రవహించవా నిమిషమా ప్రయాణించవా

నా స్థితిని మళ్ళించవా నా విధిని మరిపించవా
నా స్థానాన్ని మార్చెదవా నా అవస్థను నడిపించవా

వేళ కాని వేళలో నన్ను అభాగ్యం నుండి వదిలించవా తక్షణమే తరలించవా  || సమయమా ||

అద్భుతాన్ని దాచుకోలేను ఆశ్చర్యాన్ని చూసుకోలేను
ఆనందాన్ని పంచుకోలేను అవసరాన్ని తీర్చుకోలేను

ఆచరణాన్ని పాటించలేను ఆదర్శాన్ని ప్రకటించలేను 
ఆవరణాన్ని ఆకర్షించలేను అనురాగాన్ని అందించలేను  || సమయమా ||

అద్వైత్వం తెలుసుకోలేను అపూర్వం తెలుపుకోలేను
అనూహ్యం సాధించుకోలేను అఖండం విడుచుకోలేను

అనంతం మార్చుకోలేను ఆద్యంతం బోధించలేను
అంతరాత్మం అందుకోలేను అనంతరం ప్రయాణించలేను  || సమయమా ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion