14, సెప్టెంబర్ 2020, సోమవారం

ఆకాశమంతా సూర్యోదయం కనిపించేదెలా

ఆకాశమంతా సూర్యోదయం కనిపించేదెలా 
ఆ దేశమంతా మహోదయం కనిపించేదెలా 

ఆ ప్రాంతమంతా ఉషోదయం కనిపించేదెలా 
అంగణమంతా పూర్వోదయం కనిపించేదెలా 

పరిశుద్ధమైన పర్యావరణం ప్రభాతమై ప్రభవించేదెలా 
పవిత్రమైన ప్రభంజనం ప్రశాంతమై ప్రసాదించేదెలా 

ప్రయాణమంతా పత్రహరితమై పరిపూర్ణంగా పరిమళించేదెలా 
ప్రకాశమంతా ప్రజ్ఞానవేదాంతమై ప్రతేజంగా ప్రజ్వలించేదెలా   || ఆకాశమంతా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి