11, డిసెంబర్ 2017, సోమవారం

నాలో విశ్వ భావన ఎక్కడ ఉన్నదో

నాలో విశ్వ భావన ఎక్కడ ఉన్నదో
నాలో విశ్వ తత్వన ఎక్కడ ఉందో

నాలోని భావనయే వేదమని తెలిసేనా
నాలోని తత్వనయే జ్ఞానమని తోచేనా

జ్ఞానేంద్రియాల విచక్షణచే విశ్వ వేదాంతం మేధస్సుకే కలిగేనా  || నాలో ||

దేహంలోని దైవత్వం దాగున్నదో
జీవంలోనే జీవత్వం నిండున్నదో
రూపంలోనే సర్వత్వం వెలిసినదో
శరీరంలోనే శతత్వం అవతరించిందో

జీవుల మేధస్సులలోనే సర్వ జీవ దేహ రూప భావాలు వెలిసేనా  || నాలో ||

మనస్సులోనే జీవ మాధుర్యమా
వయస్సులోనే భావ వయ్యారమా
ఆయుస్సులోనే వేద ఆరోగ్యమా
ఉషస్సులోనే దేహ ఉదయమా 

మనస్సు వయస్సుతోనే కాలం ఉషస్సుతో ప్రయాణించేనా  || నాలో ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion