14, డిసెంబర్ 2017, గురువారం

మేధస్సును మరువలేను ఆలోచనను ఆపలేను

మేధస్సును మరువలేను ఆలోచనను ఆపలేను
మనస్సును నిలుపలేను భావనను తొలచలేను

మనస్సు ఉన్నంత కాలం మేధస్సులో భావాలోచన చలించేను  || మేధస్సును ||

శ్వాసతో చలనం ధ్యాసతో కదలికం ఆలోచనతో అనేకం
భాషతో గమనం జీవంతో ప్రయాసం భావనతో మమేకం

కాలంతో ప్రయాణం సమయంతో కార్యాచరణం
వేదంతో పరిశోధనం విజ్ఞానంతో అనుభవగారం   || మేధస్సును ||

రూపంతో బంధాల పరిచయం దేహంతో ప్రకృతి పరిశోధనం
మేధస్సుతో భావాల మధురం మనస్సుతో విశ్వతి ప్రయాణం

పరభాషతో మాటల మాధుర్యం పరధ్యాసతో కాలమంతా తపనం
వయస్సుతో వేదాల పాండిత్యం మనస్సుతో జగమంతా గమనం   || మేధస్సును || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి