14, డిసెంబర్ 2017, గురువారం

సమయంతో సాగిపోయే రూపం కాలంతో నిలిచిపోయే దేహం

సమయంతో సాగిపోయే రూపం కాలంతో నిలిచిపోయే దేహం
మనస్సుతో సాగిపోయే భావం వయస్సుతో నిలిచిపోయే తత్వం  || సమయంతో ||

మేధస్సుతో ఎంత ఎదుగుతున్నా వయస్సుతో అంతగా ఒదుగుతున్నా
మనస్సుతో ఎంత ఎదుగుతున్నా ఆయుస్సుతో అంతగా ఒదుగుతున్నా

జీవంతో ఎంత ఎదుగుతున్నా ధ్యానంతో అంతగా ఒదుగుతున్నా
రూపంతో ఎంత ఎదుగుతున్నా దేహంతో అంతగా ఒదుగుతున్నా   || సమయంతో ||

సాధనతో ఎంత ఎదుగుతున్నా కార్యంతో అంతగా ఒదుగుతున్నా
ప్రేమంతో ఎంత ఎదుగుతున్నా స్నేహంతో అంతగా ఒదుగుతున్నా

జగతితో ఎంత ఎదుగుతున్నా దైవతితో అంతగా ఒదుగుతున్నా
ప్రకృతితో ఎంత ఎదుగుతున్నా విశ్వతితో అంతగా ఒదుగుతున్నా  || సమయంతో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి