Tuesday, March 24, 2026

నీ రూప ప్రతి బింబంలో ఏమున్నది నీ మేధస్సులో ఉన్న విజ్ఞానమే నీ రూప స్వరూపాన్ని తెలియజేస్తుంది

నీ రూప ప్రతి బింబంలో ఏమున్నది నీ మేధస్సులో ఉన్న విజ్ఞానమే నీ రూప స్వరూపాన్ని తెలియజేస్తుంది 

నీ రూపాన్ని సౌందర్యములకై రూపుదిద్దుకోవద్దు విజ్ఞాన భావ తత్వాలతో సమ స్వభావాన్ని దర్శింపజేసేలా ఉత్తేజవంతమైన రూపంగా పరిశుభ్రత చేసుకో 


-- వివరణ ఇంకా ఉంది!

ఏ అణువును నీవు తాకినా ఆ అణువు స్పందిస్తుంది

ఏ అణువును నీవు తాకినా ఆ అణువు స్పందిస్తుంది 

ప్రతి అణువు స్పందించుటలో నీవు గ్రహించగలవా అణువుల భావ తత్వాల స్వభావాలను వాటి కార్యాల విధానాలను  


-- వివరణ ఇంకా ఉంది!

Monday, March 23, 2026

నేటి నిర్మాణములు రేపటికి చెదిరిపోతే నిర్మించుటలో మానవ విజ్ఞానంలో ప్రయోజనం ఏమున్నది

నేటి నిర్మాణములు రేపటికి చెదిరిపోతే నిర్మించుటలో మానవ విజ్ఞానంలో ప్రయోజనం ఏమున్నది 

ప్రయోజనం లేని మానవ విజ్ఞానం ఏ మనిషికి ఏ జీవికి ఏ సమాజానికి ఏ ప్రకృతికి ఏ విశ్వానికి అవరం లేదు  2

మానవుని శ్రమ విజ్ఞాన అనుభవాలు ప్రయోజనం కాకపోతే జీవించుటలో పరమార్థం ఏమున్నది 


-- వివరణ ఇంకా ఉంది!

ఆనాటి వేదాలలో కూడా లేని విజ్ఞాన భావ తత్వాలను తెలుసుకోవాలి

ఆనాటి వేదాలలో కూడా లేని విజ్ఞాన భావ తత్వాలను తెలుసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

ఏ విత్తనమైనా కాస్త ఊపిరి ఉంటే చాలు మొలకెత్తి వృక్షమై జీవిస్తుంది

ఏ విత్తనమైనా కాస్త ఊపిరి ఉంటే చాలు మొలకెత్తి వృక్షమై జీవిస్తుంది 

ఏ విత్తనమైనా ఎక్కడ ఏ పొరలలో ఉన్న కాస్త ఊపిరి ఉంటే చాలు మొలకెత్తి వృక్షమై ఎదుగుతూ చిగురిస్తూ  జీవిస్తుంది 

విత్తనం కాస్త ఊపిరితో వృక్షమైతే ఎన్నో జీవరాసులకు నిరంతరం పరిశుద్ధమైన ప్రాణ వాయువును అందిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

 

సూర్యోదయం ప్రకృతి పరిశోదయం విశ్వం విజ్ఞానోదయం కాలం జ్ఞానోదయం

సూర్యోదయం ప్రకృతి పరిశోదయం విశ్వం విజ్ఞానోదయం కాలం జ్ఞానోదయం 
సమయం శ్రమయెదయం పరమార్థం పరమాత్మోదయం సహనం  సహాయోదయం  

ఉదయం ఉత్తేజం నవ విజ్ఞాన కార్యాల కాల క్రమ విధాన అణు పరిశోధన శ్రమయం 


-- వివరణ ఇంకా ఉంది!

ఎలా జన్మించినా ఎదుగుటలో శ్రమించాలి జీవించుటలో విజ్ఞానం చెందాలి

ఎలా జన్మించినా ఎదుగుటలో శ్రమించాలి జీవించుటలో విజ్ఞానం చెందాలి 
కార్యములన్నీ విజ్ఞాన శ్రమతో సాగాలి ఆరోగ్య భావంతో విశ్రాంతి పొందాలి  


-- వివరణ ఇంకా ఉంది! 

మానవుని విజ్ఞాన భాష పరమాత్మకైనా పర భాషగా తెలుసో లేదో

మానవుని విజ్ఞాన భాష పరమాత్మకైనా పర భాషగా తెలుసో లేదో 


-- వివరణ ఇంకా ఉంది! 

ఒక మహా భావనతోనైనా మేధస్సు విజ్ఞానం చెందాలి ఒక మహా తత్వంతోనైనా దేహస్సు ఆరోగ్యం పొందాలి

ఒక మహా భావనతోనైనా మేధస్సు విజ్ఞానం చెందాలి  ఒక మహా తత్వంతోనైనా దేహస్సు ఆరోగ్యం పొందాలి 


-- వివరణ ఇంకా ఉంది!

భుజించేవి ప్రకృతి ఆహార పదార్థాలైనా అవి ఆత్మ పదార్థాలే పరమాత్మ ప్రభావాలతో ఉద్భవించినవే

భుజించేవి ప్రకృతి ఆహార పదార్థాలైనా అవి ఆత్మ పదార్థాలే పరమాత్మ ప్రభావాలతో ఉద్భవించినవే 
అంతా పరమాత్ముని ప్రభావమైన పంచభూతాల కాల స్థితులతో ఎదిగిన ఆత్మ రూప స్వరూపములే 


-- వివరణ ఇంకా ఉంది! 

అందరూ మానవుడిగానే జన్మిస్తారు ఎదుగుటలోనే మహాత్ములుగా పరమాత్ములుగా అవతరిస్తారు

అందరూ మానవుడిగానే జన్మిస్తారు ఎదుగుటలోనే మహాత్ములుగా పరమాత్ములుగా అవతరిస్తారు 

ఆత్మ మహా ఆత్మగా లేదా పర ఆత్మగా ఎదుగుతూ మహా విజ్ఞానంతో పర జ్ఞానంతో విశ్వ విజ్ఞానంతో 
బ్రంహాండమంతా అవతరిస్తుంది 

మహాత్ములుగా మహర్షులుగా పరమాత్ములుగా అవతరించుటలో ఆచరణ నియమాల సిద్ధాంతాలు చాలా 
పరిశుద్ధమైనవిగా ఉంటాయి 

ఎదుగుటలో భావ తత్వాల స్వభావాలు పర ధ్యాసలో ఆలోచన పరమై మేధస్సులో కలిగే ఎన్నో మార్పులు శరీరంలో వివిధ ప్రభావాలతో మిళితమైపోతాయి  


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయాన విశ్వ స్వరూపాన్ని చూస్తూ శిలగా లీనమై సాగిపోతున్నావా

సూర్యోదయాన విశ్వ స్వరూపాన్ని చూస్తూ శిలగా లీనమై (మారిపోతూ) అస్తమించే దాకా సాగిపోతూ నిద్రలో వెళ్ళిపోతూ యుగ యుగాలుగా నిశ్చల భావ స్వభావ తత్వంచే సాగిపోవునా అలాగే నిలిచిపోవునా 

సూర్యోదయాన కలిగే విశ్వ స్వరూప దర్శనం మేధస్సులో మరవని హృదయంలో కదలని ప్రతి రూప భావ తత్వం పుష్పంలో ఉద్భవించే పరిమళ పరిశుద్ధం ప్రకృతికే పరిపూర్ణమైన సువర్ణ సుగంధ వైభోగం మహానంద మహోత్సవం 

సూర్యోదయాన బ్రంహాండాన్ని ఆకాశమంతా విశ్వ ప్రకృతిగా చూపిస్తూ నేత్రాలేనిత్యం తిలకించేలా జగమంతా సౌందర్యమైన స్వరూపాలతో అద్భుతమై అపారమైన ఆశ్చర్యములతో ఉద్భవిస్తూనే పరిశోధనలు పరిశుద్ధం చెందెనే 

సూర్యోదయం ఎవరిలో నిలిచిపోవునో ఎలా మిగిలిపోవునో కాలంతో సాగే జీవ భావాలకు తెలియని అపూర్వమైన తత్వములే మళ్ళీ ఎందరిలో ఉదయించేలా ప్రతి రోజు సూర్య భ్రమణం విశ్వమంతా కాల గమనమై సాగిపోయేనుగా 


-- వివరణ ఇంకా ఉంది! 

కార్యములన్నీ సమస్యలుగానే కాలంతో సాగుతూ మిగిలిపోతున్నాయి

కార్యములన్నీ సమస్యలుగానే కాలంతో సాగుతూ మిగిలిపోతున్నాయి  

ఎన్నో విధాలుగా శ్రమించినా ఐశ్వర్యం లేక కార్యములను సాగించలేక సమస్యలు హెచ్చుగా మారుతున్నాయి 

కాల మార్పులతో సమస్యలు కఠినమై అధిక తీవ్రమై కార్యములను తలచకుండానే తరతరాలుగా మిగిలిపోతున్నాయి 

కార్యాలను సాగించే శ్రమ ప్రయత్నములు ఎన్ని చేసినా ఐశ్వర్యంచే సమస్యల పరిష్కారం లభించునని విజ్ఞానం కూడా గ్రహిస్తున్నది 

సమస్యలు ఎవరివో ఎందుకు మనవిగా సాగుతూ మనతోనే పరిష్కారం లేక మిగిలిపోతూ కాలంతో వస్తున్నాయి 

అభివృద్ధి చెందుతూ ఐశ్వర్యం పొందుతూ విజ్ఞానంతో సమస్యలను కార్యాలుగా చేసుకుంటూ సాగిపోతే పరిష్కారమవుతూ సరైన వ్యవధిలోనే తీరిపోవునుగా 

ఆలోచనలలో కార్య సాధన తెలిసినా కార్యాలను నడిపించే మానవ విజ్ఞానం ఐశ్వర్యం మార్గదర్శకం కావాలి 

మానవుడికి మానవుడే సహాయం చేసుకుంటేనే సమస్యలు ఎన్నున్నా ఎలా వున్నా తీరిపోవునుగా 


-- వివరణ ఇంకా ఉంది!

సూర్యోదయంలోనే మహోదయమైన ఋషులు మహర్షులు మహాత్ములు పరమాత్మ స్వరూపులు దర్శనమిస్తారు

సూర్యోదయంలోనే మహోదయమైన ఋషులు మహర్షులు మహాత్ములు పరమాత్మ స్వరూపులు దర్శనమిస్తారు 

సూర్యోదయం నుండే మహోదయమైన ఋషులు మహర్షులు మహాత్ములు పరమాత్మ స్వరూపులు ఉద్భవిస్తారు 

ప్రతి జీవికి ఋషికి మహర్షికి మహాత్మునికి మహర్షికి అణువుకు పరమాణువుకు ఆత్మకు పరమాత్మకు సైతం సూర్యుడే గురువు మహా గురువు జగద్గురు 

బ్రంహాండమంతటికి సూర్యుడే మహా గురువు మార్గదర్శకుడు విశ్వ కార్యములకు సర్వాధిపతి పర బ్రంహ స్వరూపుడు కాల విధేయుడు 
 
  
-- వివరణ ఇంకా ఉంది!

సూర్యుడే నీ ఆరోగ్యం కోసం ప్రతి రోజు నీ ముందు దర్శనమిస్తున్నాడు

సూర్యుడే నీ ఆరోగ్యం కోసం ప్రతి రోజు నీ ముందు దర్శనమిస్తున్నాడు  

సూర్యున్ని ప్రతి రోజు దర్శించుకుని ఉత్తేజవంతమైన సూర్య రశ్మి కాంతితో ఆరోగ్యం చెంది అనంతమైన మహా కార్యాలను సాధన చేస్తూ జీవితాన్ని సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!
ఆత్మ స్వరూపమైన జీవ రూపానికి ఆకలిని తీర్చవా పర ఆత్మ (పరమాత్మ) 

ప్రతి జీవి ఆకలితో నిద్రించరాదు ఆకలితో శ్రమించరాదు ఆకలితో మరణించరాదు  

ప్రతి జీవికి శరీరంలో ఉత్తేజవంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే ఆకలిని అందించగలవా 

ప్రతి జీవి శక్తి సామర్థ్యాలతో ఉన్నప్పుడే ఆకలిని తీర్చుకునేందుకు ప్రయత్నించాలి ఆహారాన్ని పొందగలగాలి  సంపాదించుకోవాలి 

ఆకలితో ఉన్నప్పుడు ఆహారం కోసం జీవితంపై నిరాశ చెందకూడదు జీవితాన్ని లక్ష్యంకై సాధించాలి 

ప్రతి అణువు (పదార్ధం) ఉపయోగవంతమైనది జీవంతో శక్తివంతమైనది 

-- వివరణ ఇంకా ఉంది!

Thursday, March 19, 2026

ప్రశాంతంగా ఉన్నప్పుడే భగవంతున్ని ప్రార్థించగలవు కీర్తనను ఆలకించగలవు

ప్రశాంతంగా ఉన్నప్పుడే భగవంతున్ని ప్రార్థించగలవు కీర్తనను ఆలకించగలవు  

ప్రశాంతత లేకపోతే మేధస్సులో ఏకాగ్రత లేక సమస్యలతో పర ఆలోచనలతో సాగిపోయెదవు 

యాదార్థమైన ప్రధానమైన అవసరమైన కార్యాలతో విజ్ఞానంగా ముందుకు సాగడమే జీవన విధాన జీవిత లక్ష్యం 

-- వివరణ ఇంకా ఉంది!

ఎవరికైనా ఏనాటికైనా సుఖించమని తెలుపవద్దు శ్రమించమనే తెలుపుకోవాలి

ఎవరికైనా ఏనాటికైనా సుఖించమని తెలుపవద్దు శ్రమించమనే తెలుపుకోవాలి 

సుఖించుటలో కలిగే ఆనందం తాత్కాలికమైన కార్యాలతో కాలాన్ని సాగించడమే 

శ్రమించుటలో కలిగే ఫలితం సుదీర్ఘంగా కాలంతో సాగే బంధాల అనుబంధాల ఆనందం

శ్రమించుటలో నీ సమస్యలు పరిష్కారించబడుతూ నీకు నీ బంధాలకు దీర్ఘ కాలంగా అవసరమయ్యే వాటిని నీవు సమకూర్చుకోగలవు  

ఏనాడైనా నీవు సుఖించబడితే భవిష్య కాలాన్ని గమనిస్తూ శ్రమను అలవాటు చేసుకోవాలి శ్రమతోనే జీవిస్తూ నిరంతరం ఆరోగ్యాంగా విజ్ఞానంగా కార్యాచరణ నైపుణ్యంతో కాల సమస్యలను పరిష్కారించుకుంటూ సాగిపోవాలి 

శ్రమ లేని జీవితం విజ్ఞాన నైపుణ్యం లేని జీవన విధానం శ్రమలో కార్యక్రమాన్ని గమనించలేని అవగాహనతో సాగే సామాన్యమైన జీవితం 

కార్యక్రమ విధానంలో విజ్ఞానం పరిశుద్ధత జాగ్రత్త సంరక్షణ ఇలా ఎన్నో గ్రహించాలి అవలంబించాలి చూసుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ఏ రోజైనా సరే ఏ సమయమైనా సరే కావలసిన వారికి నీవు అందుబాటులో ఉండాలి

ఏ రోజైనా సరే ఏ సమయమైనా సరే కావలసిన వారికి నీవు అందుబాటులో ఉండాలి అవసరానికి ఉపయోగపడాలి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి జీవికి ప్రతి రూపానికి శ్వాసయే ప్రదానం సర్వస్వము

ప్రతి జీవికి ప్రతి రూపానికి శ్వాసయే ప్రదానం సర్వస్వము  శక్తి ప్రభావము 

శ్వాస స్వయంభువ ధారణ శక్తితో ప్రతి జీవిలో రూపంలో ప్రవేశిస్తూ జీవిస్తుంది 

శ్వాస ప్రయాసను గమనిస్తే శ్వాస ఆరోగ్య స్థాన స్థితి ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో తెలుస్తుంది 

నిర్జీవముల అణువులలో ఉన్న స్థితి శ్వాస లేని జీవ స్థితి - ప్రకృతి స్థితినే అపారమైన నిర్జీవ బాహ్య శ్వాసగా (ప్రకృతి కాల స్థితి శక్తిగా) అణువులు (రూపములు - పంచభూతాలు, పర్వతాలు, అరణ్యములు, వృక్షాలు, భూ ప్రదేశాలు, గిరులు, రాళ్లు, ఖనిజాలు, రసాయనములు, జల ప్రవాహములు మొదలైనవి - రూపకల్పనలు: వస్తువులు వస్త్రాలు యంత్రములు పనిముట్లు పరికరాలు అగ్ని వాయువులు నిర్మాణములు కట్టడాలు గృహములు సంస్థలు మందిరములు మొదలైనవి) కలిగివుంటాయి 

ప్రకృతి రూపాలను రూపకల్పన చేయుటలో ప్రకృతి స్థితిని కోల్పోయి కృత్రిమమైన శక్తిని కలిగి జీవిస్తుంది 

ప్రకృతికి ఎటువంటి సంరక్షణ నిర్వహణ అవసరం లేదు మన నియమాలు దానికి వాటికి అవసరం లేదు 
రూపకల్పన చేసుకున్న ఆకృతులకు వస్తువులకు వస్త్రాలకు మందిరాలకు యంత్రాలకు నిత్యం నిర్వహణ నియమం సంరక్షణ ఉండాలి 

నిర్వాహణ సంరక్షణ లేకపోతే ప్రయోజన స్థితిని కోల్పోతాయి 


-- వివరణ ఇంకా ఉంది!


బ్రంహ ఐనను రూపాన్ని సృష్టించుటలో కాస్త సమయం బ్రంహాండాన్ని సమస్తం మరవగలడు

బ్రంహ ఐనను రూపాన్ని సృష్టించుటలో కాస్త సమయం బ్రంహాండాన్ని సమస్తం మరవగలడు 
ఏ మేధస్సు ఐనా కార్యాన్ని సాగించుటలో తన పరిధిలో ఉన్న సమస్తాన్ని కాస్త సమయం మరచిపోగలడు 

కార్యంపై దృష్టి పెడితేనే కార్యం సాఫల్యంగా సాగుతూ శుభాన్ని తెలుపుతుంది 

కార్య దృష్టి ఏకాగ్రతతో సాగే శరీర శ్రమ ధ్యాసను అవగాహనతో అనుభవంగా మారుస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ఎటువంటి భావమైనా విజ్ఞాన తత్వమై మహోదయమైన రూప స్వరూపమై మేధస్సులో నిక్షిప్తమై మేధావి పరిశోధనలో కాల కార్యమై దాగి ఉంటుంది

ఎటువంటి భావమైనా విజ్ఞాన తత్వమై మహోదయమైన రూప స్వరూపమై మేధస్సులో నిక్షిప్తమై మేధావి పరిశోధనలో  కాల కార్యమై దాగి ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

ప్రసాదాలు తాజాదనంతో పరిశుద్ధంగా ఉన్నప్పుడే పది మందికి వృధా కాకుండా పంచాలి

ప్రసాదాలు తాజాదనంతో పరిశుద్ధంగా ఉన్నప్పుడే పది మందికి (మానవులకు, జనులకు ) వృధా కాకుండా పంచాలి   

ప్రసాదాలు తాజాదనంతో ప్రకృతి సృష్టించిన రూపాలతో ఉంటేనే ఏ మానవుడైనా స్వీకరించగలడు ఆస్వాదించగలడు 

ప్రసాదాలు ప్రకృతి సృష్టించిన రూపాలతో కాకుండా వివిధ రూపకల్పనలతో వంటకాలుగా తయారుచేస్తే కొందరు మాత్రమే స్వీకరించగలరు ఆశ్వాదించగలరు (ఇష్ట కష్టములుగా గుర్తించగలరు భావించెదరు)


ప్రకృతి అనంతమైన వివిధ రకాల ఆహార పదార్థాలను అమృత తత్వంతో కాల స్థితి భావాలతో అపూర్వమైన స్వభావాలతో అపారమైన శ్రమతో సృష్టిస్తుంది 

ప్రకృతి ఇచ్చే ఆహార పదార్థాలను తాజాదనంతో నాణ్యత శ్రేష్టత ఉన్నప్పుడే ఆస్వాదించాలి 
ఆహారం ఎంత కావాలో అంతే పరిమాణాలతో వృధా కాకుండా తాజాదనంతో ఆస్వాదించాలి 

ఆహారం యొక్క తాజాదనం శరీరానికి ఉత్తేజం ఆరోగ్యం ప్రశాంతత ఆకర్షణీయత విజ్ఞాన యోగ్యతను కల్పిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, March 18, 2026

శాపములు ఫలిస్తాయంటే మంచి శుభములను శాపములుగా ఒక్కాణించి చెప్పవచ్చుగా

శాపములు ఫలిస్తాయంటే మంచి శుభములను శాపములుగా ఒక్కాణించి చెప్పవచ్చుగా 

నీకు మంచియే జరుగుతుంది నీ కార్యములు అన్నీ శుభములుగా సుఖ సంతోషాలతో సాగిపోతాయి 

నీవు మంచివాడివే నీవు మహానుభావుడివే నీవు మహాత్ముడివే నీకు అన్నీ శుభపరములే శుభశకునములే 

ఇంతకు ముందు నుంచే శాపములతో జీవిస్తున్నా మళ్ళీ కొత్త శాపములు విధించుటలో ఎంతవరకు ఫలిస్తాయో విధిగా శ్రమించుటలో అనారోగ్యం చెందుటలో అశాంతతతో సాగుటలో అజ్ఞానంతో సాగే కార్యములలో తెలుస్తున్నాయి 
ఫలితములు లేని శ్రమలు ఎన్నో అనారోగ్యానికి అయ్యే ఖర్చులు ఎన్నో అజ్ఞానంతో జరిగే ప్రమాదాలు ఎన్నో 

శాపములు విధించు వారికి శాపములు ఫలించే శక్తులు ఉంటే సమాజాన్ని పరిశుద్ధంగా విజ్ఞానంగా పర్యావరణంగా మార్చే కార్యములు జరిగేలా శాములను వరములుగా ఉచ్చారించి ఎవరితోనైనా జరిగేలా చెప్పవచ్చుగా 

-- వివరణ ఇంకా ఉంది!

కవిగా గుర్తింపు వచ్చేంత వరకు కవిగా జీవించలేవు

కవిగా గుర్తింపు వచ్చేంత వరకు కవిగా జీవించలేవు 

విజ్ఞానాన్ని కవితలుగా కాల మార్పులను మరో వేదంగా తెలుపుతూ జీవించుటలో భవిష్య విజ్ఞానం గోచరిస్తుంది 

కవితలలో అనంతమైన విశ్వ విజ్ఞానం అపూర్వమైన అపారమైన నైతిక విలువలు క్లుప్తంగా సంక్షిప్తంగా దాగి ఉంటాయి 

విజ్ఞానాన్ని ఎవరితో సంభాషించుటకు వీలు లేనప్పుడు తనలో తానే మరో మనిషిగా ఋషిగా మరో ఆచార్యుడిగా ఉద్భవిస్తూ వేదాలను అనంత కాల దృష్టిని కవితలుగా తెలుపుకుంటాడు 


-- వివరణ ఇంకా ఉంది!  

ప్రతి రోజు ఐశ్వర్యాన్ని ఖర్చు చేసుకుంటూ సాగిపోతే కార్యక్రమాలు సాగిపోతాయి

ప్రతి రోజు ఐశ్వర్యాన్ని ఖర్చు చేసుకుంటూ సాగిపోతే కార్యక్రమాలు సాగిపోతాయి దిన చర్య అవసరాలు తీరిపోతాయి 

ప్రతి రోజు ఐశ్వర్యాన్ని పొదుపు చేసుకుంటూ సాగిపోతే మహా కార్యాలను చేపట్టే అవకాశాలు భవిష్య కాలంలో  కలుగుతాయి దీర్ఘ కాలపు అవసరాలు తీరిపోతాయి సమస్యలు పరిష్కారించబడుతాయి 


--  వివరణ ఇంకా ఉంది! 

పొదుపును అదుపులో ఉంచుకుంటే ముడుపులు వస్తాయి

పొదుపును అదుపులో ఉంచుకుంటే [పెట్టుబడి పెడితే] ముడుపులు [లాభాలు] వస్తాయి 
ముడుపులను అదుపులో ఉంచుకుంటే ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది 

పొదుపుతో వచ్చే ముడుపులను మళ్ళీ పొదుపుగా చేసుకుంటే ఐశ్వర్యం నిరంతరం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూ వస్తాయి వస్తూనే ఉంటాయి 

ఐశ్వర్యం వలన విజ్ఞానం ఆరోగ్యం ఆనందం అనుభవం అనుబంధం అభివృద్ధి సౌకర్యం ప్రశాంతత ధైర్య సాహసం కలుగుతాయి 

ఐశ్వర్యాన్ని ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకోవాలి [దుర్వినియోగం చేసుకుంటే ఏదీ లభించదు అలాగే ఉన్నది కూడా వెళ్ళిపోతుంది]

-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యోదయంతో మేధస్సులో ఉత్తేజం కలిగితేనే కార్యములు శుభారంభమై విజయాలను అందిస్తాయి

సూర్యోదయంతో మేధస్సులో ఉత్తేజం కలిగితేనే కార్యములు శుభారంభమై విజయాలను అందిస్తాయి  

ఉత్తేజంతో చేసే కార్యాలు క్రమ విధంగా సాగుతూ పరిశుద్ధంగా జాగ్రత్తగా విజ్ఞానంగా ప్రకృతి స్వచ్ఛతగా ఆరోగ్యంగా అభివృద్ధి పరంగా ఫలితాలను అందిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, March 17, 2026

ఎన్నో భావ తత్వములు తెలిసినా జీవించుటలో అనంతమైన భావ తత్వములను తెలుకోగలవు

ఎన్నో భావ తత్వములు తెలిసినా జీవించుటలో అనంతమైన భావ తత్వములను తెలుకోగలవు  

వయస్సుతో పాటు బాధ్యతలతో పాటు కుటుంబ బంధాల కార్యాలతో పాటు కాల మార్పులతో పాటు భవిష్య విజ్ఞానంతో పాటు ఎన్నో విధాలా ఎన్నో మార్పులతో ఎన్నో భావ తత్వాలను తెలుసుకోగలవు 

భావ తత్వములలో ఎన్నో అర్థాలు పరమార్థాలు పర ఆత్మ పర భావ స్వభావములు వివిధ రకాలుగా దాగి ఉన్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Monday, March 16, 2026

కలియుగ జ్ఞానంచే జీవించు మానవ విజ్ఞానానికి పరిశుద్ధత తెలియదా

కలియుగ జ్ఞానంచే జీవించు మానవ విజ్ఞానానికి పరిశుద్ధత స్వచ్ఛత నిర్మలత్వం తెలియదా   

పరిశుద్ధతయే ప్రదానమని ప్రకృతియే పరిపూర్ణమైన పరిమళాలను జీవ శ్వాసకు నిత్యం అందించేనుగా 

పరిశుద్ధత అంటే పరిశుభ్రత మాత్రమే కాదు పరిశుద్ధత ఆరోగ్యంలో ఆహారంలో విజ్ఞానంలో కార్యక్రమ విధానంలో జాగ్రత్తలతో రక్షణలలో ప్రయాణాలలో సమాజంలో గృహములలో సంస్థలలో కర్మాగారాలలో ఆలయములలో భవనాలలో అంతస్తులలో అలవాట్లలో అణువు పరమాణువు నుండి రూపం మహా రూపం వరకు మంచి తనం సత్ప్రవర్తన ఆకర్షణీయంగా ఉత్తేజంగా కనిపించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

నీవు గొప్ప వాడివైతే నీ తండ్రి గొప్పవాడవుతాడు కాని నీ కుమారులు గొప్పవారు కాలేరు

నీవు గొప్ప వాడివైతే నీ తండ్రి గొప్పవాడవుతాడు కాని నీ కుమారులు గొప్పవారు కాలేరు 

నీవు సంపాదించినదంతా నీ కుమారులు అనుభవిస్తే వారు గొప్పవారు కాలేరు 
నీవు సంపాదిస్తున్నావంటే అది నీ తల్లి తండ్రుల శ్రమ ఫలితం తప్ప మరేది కాదు 

నీ కుమారులు గొప్పవారు కావాలంటే ఐశ్వర్యం ఆహారం ప్రశాంతత నిద్ర గొప్పగా లేకుండా మహా గొప్ప కార్యాల కోసం శ్రమించి విజయాలను సాధించాలి 

-- వివరణ ఇంకా ఉంది! 

ప్రతీది ఆకాశం మధ్యలో ఉన్నట్లు లేదా

ప్రతీది ఆకాశం మధ్యలో ఉన్నట్లు లేదా 

నీవైనా ఏదైనా ఎక్కడికి వెళ్లినా క్రింద ఉన్నదంతా (ఆకాశం అంచు కనబడకపోతే) ఆకాశం మధ్యలో ఉన్నట్లే అనిపిస్తుంది 

ఏ దిక్కులో ప్రయాణిస్తున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆకాశం పైవైపు చూస్తే ప్రతీది (క్రింద ఉన్నవన్నీ) మధ్యలో ఉన్నట్లు అనిపిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

పరిశుద్ధత లేకుండా పవిత్రత లభించదు

పరిశుద్ధత లేకుండా పవిత్రత లభించదు 
ఇంటిలోనైనా సమాజంలోనైనా ఆలయంలోనైనా ఎటువంటి ప్రదేశంలోనైనా పరిశుద్ధత ఉంటేనే పవిత్రత లభించును 


-- వివరణ ఇంకా ఉంది! 

Saturday, March 14, 2026

మన బంధాల జీవితాలను బంధాలుగా సంబంధాలుగా అప్పగిస్తూ సాగిపోతున్నాముగా

మన బంధాల జీవితాలను బంధాలుగా సంబంధాలుగా అప్పగిస్తూ సాగిపోతున్నాముగా 

మన భావ తత్వాలను తరతరాలుగా సాగేందుకు మన జీవితాలను ఓర్పుగా సాగిస్తున్నాముగా 
మన విజ్ఞాన అభివృద్ధిని ఆరోగ్యంగా పరిశుద్ధమైన ఆహారంగా జీవన శాస్త్రీయంగా ఆచరణ సిద్ధాంతంగా రక్షణతో సురక్షితంగా అనేక కార్యాల జాగ్రత్తలతో సాగిస్తూ సాగిపోతున్నాముగా 


-- వివరణ ఇంకా ఉంది! 

శ్రమ నుండి కలిగే ఫలితాన్ని లాభం చేసుకో జీవితాన్ని మార్చుకో

శ్రమ నుండి కలిగే ఫలితాన్ని లాభం (పొదుపు) చేసుకో జీవితాన్ని మార్చుకో 

ఫలితాన్ని ఖర్చులుగా చేనుకుంటే ఖర్చులకు కూడా శ్రమించలేక పోగలవు  (ఐశ్వర్యం లేక ఆహరం లేక సామర్థ్యం లేక శ్రమించలేక జీవితాన్ని సాగించలేవు)

లాభమే (పొదుపు) ఆరోగ్యం సామర్థ్యం ఆహారం ఆనందం అభివృద్ధి అనుబంధం ఇలా ఎన్నో విధాలుగా సాగిపోతాయి శ్రమ కూడా ప్రశాంతగా సాగిపోతుంది 

ఖర్చులను అదుపు చేసుకుంటూ పొదుపును అభివృద్ధి చేసుకోవాలి విజ్ఞానంగా ఎదుగుతూజీవితాన్ని సాగించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

మోసాన్ని నీవు విరాళంగా ఇచ్చావని తెలుసుకో

మోసాన్ని నీవు విరాళంగా ఇచ్చావని తెలుసుకో 
నష్టాన్ని నీవు సహాయంగా చేశావని తెలుపుకో 

సరికాని సరిపోని జీతాలను సమాజానికి అంకితం చేశావని జ్ఞాపకం చేసుకో 
సరిలేని సమయాన్ని అనంత జీవితాలకు అనుభంధమై అనుభవాలుగా అందించావని చూసుకో 


-- వివరణ ఇంకా ఉంది!

వేదాంతాన్ని నీవు ఎలా విజ్ఞానం చెందగలవు

వేదాంతాన్ని నీవు ఎలా విజ్ఞానం చెందగలవు 
విశ్వ విజ్ఞానాన్ని నీవు ఎలా పరిశోధించగలవు 

మహా రూపాన్ని నీవు ఎలా ఏ విధంగా తిలకించగలవు 
ప్రకృతిని నీవు ఎలా శాస్త్రీయంగా ఎన్నింటిని తెలుసుకోగలవు 

మహా కార్యాలను నీవు సిద్ధాంతంగా ఎలా మార్చగలవు 
బ్రంహాండాన్ని నీవు ఎలా ఎక్కడ ఎన్ని విధాలా పరిభ్రమించగలవు 


-- వివరణ ఇంకా ఉంది! 

ఏ స్త్రీ దేవి స్వరూపమైన అలంకారణతో అద్భుతంగా దర్శనమిస్తుంది

ఏ స్త్రీ దేవి స్వరూపమైన అలంకారణతో అద్భుతంగా దర్శనమిస్తుంది 

స్త్రీ దేవి స్వరూపం మాహా స్వరూపంగా అలంకారణతోనే అవతరిస్తుంది  

స్త్రీ దేవి సౌందర్యం ఉదయించుటలో ప్రకాశవంతమైన తేజోదయంతో ఉత్తేజవంతంగా కళకళ లాడుతూ (ఆడుతూ) ఉప్పొంగిపోతుంది ఉపశమనం కలిగిస్తుంది 

స్త్రీ బహుముఖ ప్రబోధిని 


-- వివరణ ఇంకా ఉంది!

దేహానికి కాస్త ఆహారాన్ని అందించవా మాధవ మూర్తి

దేహానికి కాస్త ఆహారాన్ని అందించవా మాధవ మూర్తి  

దేహం చుట్టూ ఎన్నో అద్భుతాలు ఎన్నో మహా రూపములు ఉన్నా తిలకించుటలో దేహం ఆకలితో సాగుతున్నా పరిశుద్ధమైన ఆహారం కోసం గాలిస్తున్నది మహా తత్వ మాధవ మూర్తి 

పంచభూతములుగా ఎన్ని సృష్టించుకున్నా దేహానికి ఆహారమే ప్రదానం ఆలోచనయే పరిణామం 

ప్రతి రోజు ఎన్నో కార్యాలతో సాగుతున్నా ఆహారం లేకపోతే దేహం విలువ శ్వాస కూడా తెలుపదు మాధవా 

ఆహారంతోనే పంచభూతములు శరీర దేహాన్ని రక్షిస్తూ శ్వాసతో ఆరోగ్యాన్ని అందుకుంటూ శక్తి సామర్థ్యాలు కార్యాలుగా చేసుకోగలవు 

పంచభూతాల ప్రకృతియే ఆహారాన్ని అందిస్తుంది పంచభూతాల కాలమే ఆహారాన్ని నశింపజేస్తుంది 
ఉదయించుటలో ఆహారాన్ని అందిస్తుంది అస్తమించుటలో ఆహారాన్ని అభివృద్ధి చేస్తుంది 

అభివృద్ధి ఐనా ఆహారాన్ని ఉదయించుటలో ఉపయోగించుకోలేకపోతే పంచభూతాల కాల సమయంతో ఆహారాన్ని నశింపజేస్తుంది 

-- వివరణ ఇంకా ఉంది!

భాష కన్నా విలువైనది జీవికి ఏమున్నది

భాష కన్నా విలువైనది జీవికి ఏమున్నది 

భాషతోనే ఎన్నో స్వభావాల భావ తత్వాలు తెలుసుకుంటూనే ఎందరితో ఎన్నో సంభాషిస్తున్నావు 

భాషతో సంభాషించుటలో నీవు ఏ విధంగా జీవిస్తున్నావో తెలుసుకుంటున్నావు నీకు ఎలా ఉండాలో భాషతోనే నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు 

విశ్వ విజ్ఞానమంతయు భాషతోనే ఆలోచిస్తూ ఎన్నింటినో గమనిస్తూ ఎన్నో నవ విధాన విజ్ఞానాన్ని గ్రహిస్తూ జీవితానికి అవసరమయ్యే వాటిని సృష్టించుకుంటూ కాలాన్ని గడుపుతూ తరతరాలుగా సాగిపోవాలి 

భాష లేకపోతే ఏ జీవి దేహానికి ఏమి కావాలో ఎవరితో తెలుపోకోలేదు ఆ జీవీకే అర్థం కాదు అలాగే ఏ జీవి దేహం ఎలా ఉందో గమనించినా అర్థాన్ని శరీర స్థితి తత్వాన్ని తెలుసుకోలేవు 


-- వివరణ ఇంకా ఉంది! 

ఉదయించుటలో ఉన్న ఉత్తేజం అస్తమించుటలో లేనప్పుడు దేహమైన విశ్వ ప్రకృతి ఐనా విశ్రాంతి చెందుతుంది

ఉదయించుటలో ఉన్న ఉత్తేజం అస్తమించుటలో లేనప్పుడు దేహమైన విశ్వ ప్రకృతి ఐనా విశ్రాంతి చెందుతుంది 

విశ్రాంతి చెందుటలో కూడా విశ్వ కార్యాలు ప్రకృతి ప్రక్రియలు దేహ కార్యములు సాగుతూ చలనం చెందుతుంటాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

సూర్యోదయంతోనే మహా కార్యాలు అనంత విధాలుగా అంతమైన ప్రదేశాలలో బ్రంహాండమంతా సాగుతున్నాయి

సూర్యోదయంతోనే మహా కార్యాలు అనంత విధాలుగా అంతమైన ప్రదేశాలలో బ్రంహాండమంతా సాగుతున్నాయి  

విశ్వ ప్రకృతి పరంగా జీవుల జీవన విధాన పరంగా ఎన్నో కార్యాలు ఎన్నో విధాలా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

ప్రకృతిని ఎలా ఉపయోగించుకున్నా తన భావ తత్వాలను నీవు గ్రహించలేవు

ప్రకృతిని ఎలా ఉపయోగించుకున్నా తన భావ తత్వాలను నీవు గ్రహించలేవు  

ప్రకృతిని ఎలా వృధా చేసినా తన స్థితి విధాన భావ స్వభావ తత్వాలను నీవు గమనించలేవు 

ప్రకృతి తన జీవితాన్ని అనంత విశ్వ కాలానికి ఉపయోగపడేలా శాస్త్రీయ సిద్ధాంతంతో శ్రమిస్తూ అభివృద్ధి చెందుతూ అమూల్యమైన ముడి పదార్థాలుగా పంచ భూతాల కాల స్థితులతో తయారవుతూ అనేక విధాలుగా రూపకల్పనలు  ఎన్నో రకాలుగా మార్పులు చెందుతూ సాగుతున్నది ఎన్నింటినో బ్రంహాండానికి అందిస్తున్నది 


-- వివరణ ఇంకా ఉంది! 

పరమాత్మగా పర ఆత్మ సుఖ భావ తత్వాలు అనంత బంధాలుగా సాగుతున్నాయి

పరమాత్మగా పర ఆత్మ సుఖ భావ తత్వాలు అనంత బంధాలుగా సాగుతున్నాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, March 12, 2026

ప్రాణమే ప్రదానమని తెలిసినా వాహనాల వేగంతో ప్రమాదమే ప్రదానమయ్యేలా జీవితాలను కోల్పోతున్నారు

ప్రాణమే ప్రదానమని తెలిసినా వాహనాల వేగంతో ప్రమాదమే ప్రదానమయ్యేలా జీవితాలను కోల్పోతున్నారు  

అదుపు లేని వాహన వేగం ప్రమాదానికి ప్రదాన కారణం ఆలోచనకు అందని అదుపు విజ్ఞానానికి ప్రయోజనం లేని మరుపు  

ప్రయాణించుటలో చేరుకొనే గమ్యాలను చేరుకోలేక జీవితాలను కోల్పోయే గమ్యాలను చేరుకుంటున్నాము 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, March 11, 2026

శ్రమను పంచుకుంటే ప్రశాంతత ఆరోగ్యం అభివృద్ధి లభిస్తుంది

శ్రమను పంచుకుంటే ప్రశాంతత ఆరోగ్యం అభివృద్ధి లభిస్తుంది 

శ్రమను ఆశ్రయిస్తే కార్యాములు త్వరగా పూర్తవుతాయి ఎక్కువ కార్యములు చేసుకోవచ్చు 

కుటంబంలో శ్రమను పంచుకుంటే కార్యాలు త్వరగా పూర్తవుతూ విరామంతో పాటు ప్రశాంతత గొప్ప ఆలోచనలు ఉపాయములు కలుగుతాయి 

కొత్త కార్యములతో ఎంతో ప్రగతి అభివృద్ధి సాధించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది! 

ప్రతి రోజు వీలైనంతవరకు పొదుపు చేసుకుంటే రేపటి రోజులన్నీ ముడుపులుగా ఐశ్వర్యం పొందుతూ సాగవచ్చు

ప్రతి రోజు వీలైనంతవరకు పొదుపు చేసుకుంటే రేపటి రోజులన్నీ ముడుపులుగా ఐశ్వర్యం పొందుతూ సాగవచ్చు 

పొదుపులు చేసుకోవడం ద్వారా జీవన విధానం సాగిస్తూ కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి చెందవచ్చు (ఆరోగ్యం, ఐశ్వర్యం, విజ్ఞానం, సౌకర్యం, రక్షణం, సామర్థ్యం, అనుబంధం, ప్రశాంతత, మొదలైనవి)

ఖర్చులు చేసుకుంటూ సాగిపోతే ప్రతి రోజు ఖర్చులు పెరుగుతూ సాగిపోతాయి పొదుపులు లేకపోతే అప్పులు పెరుగుతూ సాగుతూ పోతాయి అవసరాలు సమస్యలు పెరుగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!


శ్వాస స్వరూపం పంచభూతాల కాల స్థితి పరమాత్మయే

శ్వాస స్వరూపం పంచభూతాల (ఐదు ప్రధాన ఆత్మలు - పరమాత్మ స్వరూపములు) కాల స్థితి మార్పుల రూపకల్పనల 
జీవ ధార అదృశ్య వాయు రూపమే పరమాత్మం 


-- వివరణ ఇంకా ఉంది!

Tuesday, March 10, 2026

సూర్యుడు ఎంతగా ప్రజ్వలిస్తే అనంత కార్యాలు అంతటి ఉత్తేజంగా వేగంగా సత్ఫలితాలతో సాగుతాయి

సూర్యుడు ఎంతగా ప్రజ్వలిస్తే అనంత కార్యాలు అంతటి ఉత్తేజంగా వేగంగా సత్ఫలితాలతో సాగుతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

ఆలస్యంతో అమృతం విషమైతే ఆరోగ్యం అనారోగ్యం విజ్ఞానం అజ్ఞానం యవ్వనం వృద్ధాప్యమే

ఆలస్యంతో అమృతం విషమైతే ఆరోగ్యం అనారోగ్యం విజ్ఞానం అజ్ఞానం యవ్వనం వృద్ధాప్యమే 

ఆలస్యమైతే ఉద్యోగం దూరమవుతుంది శ్రమ ఎక్కువవుతుంది ఐశ్వర్యం తగ్గుతుంది వయస్సు పెరుగుతుంది అభివృద్ధి తగ్గుతుంది అనారోగ్యం పెరుగుతుంది విజ్ఞానం తగ్గుతుంది ప్రశాంతత తగ్గుతుంది 

ఆలస్యంతో ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు భాదలు పొరపాట్లు అజాగ్రత్తలు కలగవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది! 

నేటి పొదుపులే రేపటి ముడుపులుగా ఐశ్వర్యం అభివృద్ధిగా సహాయపడుతుంది

నేటి పొదుపులే రేపటి ముడుపులుగా ఐశ్వర్యం అభివృద్ధిగా సహాయపడుతుంది  

-- వివరణ ఇంకా ఉంది!

విశ్వ విజ్ఞానమంతయు మేధస్సులోనే నిక్షిప్తమై నిర్విఘ్నమై ఉన్నది

విశ్వ విజ్ఞానమంతయు మేధస్సులోనే నిక్షిప్తమై నిర్విఘ్నమై ఉన్నది  

మేధస్సును విశ్వ ప్రకృతితో ఏకీభవిస్తూ గమనిస్తూ పరీక్షిస్తూ పరిశోధిస్తూ పర్యవేక్షిస్తూ సాగిపోతే విశ్వ విజ్ఞానమంతయు తెలుస్తుంది పరమార్థం గ్రహించబదుతుంది పరమాత్మం దర్శించబడుతుంది పరకార్యం బోధింపబడుతుంది కాలజ్ఞానంచే సర్వ కార్యాల పరమార్థం తెలుస్తుంది పర సూక్ష్మ జ్ఞాన శాస్త్రీయం తెలుస్తుంది 
పర ఆత్మ పర భావ తత్వం తెలుస్తుంది పర విధ వేదం గోచరింపబడుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, March 8, 2026

నీ సమస్యలను గ్రహించలేక ఎదుటి వారి సమస్యలను గ్రహించి సహాయం చేయుటలో నీవు ఓడిపోతున్నావు

నీ సమస్యలను గ్రహించలేక ఎదుటి వారి సమస్యలను గ్రహించి సహాయం చేయుటలో నీవు ఓడిపోతున్నావు 

ఎదుటి వారి సమస్యలు తీరిపోతూ ఎంతో అభివృద్ధి పొందుతున్నా నీ సమస్యలను గ్రహించలేక నీ కోసం (కుటుంబం) ఎటువంటి ప్రయాత్నం చేయలేక పోతున్నావు  

ఎదుటి వారిదే శ్రమగా భావిస్తూ నీ కుటుంబ శ్రమను గ్రహించక నీవు నీవుగా కార్య శ్రమ ప్రయత్నం చేయలేక పోతున్నావు 

ఎదుటి వారి కార్యాలు వేరు నీ జీవిత కార్యాలు వేరు అలాగే శ్రమించే జీవితాలు మానవ జీవన కార్యాలు వేరుగా సాగిపోతాయి  

నీవు శ్రమించకపోతే కుటుంబం అభివృద్ధి లేక అనారోగ్యమవుతుంది 

ఎదుటివారికి నిరంతరం సహాయం చేయుటలో నీవు ఓడిపోతూ కుటుంబ శ్రమకు ఫలితం లేక ఆరోగ్యం లేక అభివృద్ధి లేక ప్రశాంతత లేక విజ్ఞానం లేక ఐశ్వర్యం లేక విజయం లేక పోతున్నది 

ఎదుటి వారికి సహాయం చేయుటలో నీవు గెలుస్తూ కుటుంబం ఆరోగ్యంతో ఐశ్వర్యంతో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలి విజయాలను అందుకోవాలి 


-- వివరణ ఇంకా ఉంది!

Saturday, March 7, 2026

సూర్యోదయంతో పాటు జీవులే కాదు ప్రతి అణువు మేల్కొంటుంది

సూర్యోదయంతో పాటు జీవులే కాదు ప్రతి అణువు మేల్కొంటుంది బ్రంహాండం మేల్కొంటుంది 

సూర్య శక్తి ప్రతి అణువుకు అందుతున్నా తన శక్తి ఎంతో అనంతమై బ్రంహాండమంతా అత్యంతమైన ఎరుకతో ఉద్భవిస్తూ ప్రజ్వలిస్తూ నిరంతరం పరిభ్రమిస్తుంటుంది 


-- వివరణ ఇంకా ఉంది! 

శ్రమను లాభం చేసుకుంటేనే ప్రశాంతత లభిస్తుంది

శ్రమను లాభం (ఫలితం) చేసుకుంటేనే ప్రశాంతత (అభివృద్ధి) లభిస్తుంది 

శ్రమించడం ద్వారా విజ్ఞానం నైపుణ్యం అనుభవం జ్ఞాపక శక్తి ఐశ్వర్యం (ధన లాభం) పొందగలిగితే అభివృద్ధి (బంధాలు సంబంధాలు అనుబంధాలు అనుభవాలు సంతోషంగా సాగుతాయి) కలుగుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, March 5, 2026

సూర్యోదయానికి ముందే అస్తమించిన దేహం

సూర్యోదయానికి ముందే అస్తమించిన దేహం ఆలోచనకు అందని గమనం కాలంతో సాగని చలనం 
మహా ప్రశాంతమై నిశ్శబ్దతతో విశ్వమంతా నిద్రించే తరుణం ఏ జీవికి తెలియని భావం ఏనాటికి స్మరించని తత్వం బ్రంహాండంలో బ్రంహకైనా భ్రమగా (కల) తలిచే విషయం సముద్రాలలో సాగే అలల ప్రయాణం ఆగని ప్రవాహం 
అలలుగా తీరం చేరినా మళ్ళీ సాగరంలోనే జల ప్రవాహం ఎందరికో నిర్మలమైన సమయం 
పరమాత్మయే మెలకువతో పర ఆత్మకు తెలిపే విషయం తదుపరి కార్యాలను సాగించేందుకు పంచభూతాలే పర ఆత్మలుగా నవ రూప మానవులుగా సిద్ధం చేసే సమయం 
మహోదమైన దేహాన్ని పంచభూతాలకు అర్పించే మహాత్కార్యం బంధాలకు బహుజన మిత్రులకు ప్రతి రూపం లేని జీవిత కాలం ఆరంభం   
తన విజ్ఞానమే తన అనుచరులు సాగించే మహా కార్యాల మహోదమైన జీవిత విధానం 
తరతరాలకు సాగించే ఆచరణ సిద్ధాంతం 
అఖండమైన కాల జ్ఞాన విశ్వ ప్రముఖ ప్రఖ్యాత ప్రధాన మార్గదర్శక సమాజ సేవాహిత ఉన్నత ఆచార్య వృక్ష బోధితుడే ప్రకృతి పరంధాముడే 

-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, March 4, 2026

శ్రమించుటలో ఆశ్చర్యం ఉంటేనే ఫలించుటలో అద్భుతం ఉంటుంది

శ్రమించుటలో ఆశ్చర్యం ఉంటేనే ఫలించుటలో అద్భుతం ఉంటుంది 

శ్రమించుటలో నైపుణ్యం కార్యాచరణ ఆశ్చర్యంగా సాగితే ఫలించుటలో రూపకల్పనం కార్యసిద్ధి అద్భుతంగా దర్శనమిస్తుంది 

ఆశ్చర్యం ఒక రహస్యం లాంటిది ఒక శాస్త్రీయ సిద్ధాంతం లాంటిది ఒక కార్యక్రమ ప్రణాళిక లాంటిది ఒక కార్యాచరణ నియమం లాంటిది ఒక అభ్యాస సాధన లాంటిది ఒక అనుభవ ప్రయోగం లాంటిది ఒక విజ్ఞాన పరిశోధన లాంటిది 

మన ఫలితం ఎలా ఉండాలో మన శ్రమ కార్యం అలాంటి కార్యాచరణ విధానంతో సాధన సాగాలి 

ప్రయోగాత్మకమైన నూతన ఫలితం కలగాలంటే ఆశ్చర్యాన్ని (రహస్యాన్ని) విజ్ఞానంగా గ్రహించాలి కార్యక్రమ విధాన అవగాహన చేసుకోవాలి కార్యాలను వరుసగా క్రమక్రమంగా పరిశీలిస్తూ సాగించాలి 


-- వివరణ ఇంకా ఉంది!
 

Tuesday, March 3, 2026

ఖర్చులను లెక్కలుగా వేసుకుంటే ముందుకు రావుగా పొదుపులను లెక్కలుగా వేసుకుంటే ముందుకు వచ్చేనుగా

ఖర్చులను లెక్కలుగా వేసుకుంటే ముందుకు రావుగా పొదుపులను లెక్కలుగా వేసుకుంటే ముందుకు వచ్చేనుగా  

ఖర్చులను నీవు ఆపలేవు - ఖర్చులుగా వెళ్ళక ముందే పొదుపులుగా లెక్కలను సాగిస్తే ముందుకు రెట్టింపుగా వస్తాయి 

ఖర్చులు ఎల్లప్పుడూ ఉంటాయి పొదుపులు ఎల్లప్పుడూ చేసుకుంటే జీవితం ఒక మహా లక్ష్యాన్ని త్వరలో జయిస్తుంది 

ఖర్చులు కాలం లాంటిది పొదుపులు ప్రకృతి లాంటిది (ఖర్చులు సాగుతూనే ఉంటాయి - ప్రకృతి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఫలితాన్ని అందిస్తుంది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది)


-- వివరణ ఇంకా ఉంది!

బ్రంహాకే తెలియని బ్రంహణుడు బ్రంహాండమంతా పరిభ్రమిస్తున్నాడు

బ్రంహాకే తెలియని బ్రంహణుడు బ్రంహాండమంతా పరిభ్రమిస్తున్నాడు 

పరిశుద్ధమైన బ్రంహణుడు ప్రతి అణువులో పరమాణువులో వివిధ భావ తత్వాలతో జీవిస్తూ విశ్వమంతా తన శ్వాస ధ్యాస పరిణామాలతో పరిభ్రమిస్తున్నాడు 

విశ్వ ప్రకృతిలో సాగే కార్యాలను గమనిస్తూ పరిశోధిస్తూ తన భావ తత్వాలను పరీక్షిస్తూ అణువులుగా పరమాణువులుగా వివిధ రూపాల పరిణామాలతో ఎన్నో ఆకార రూపాలతో మారుతూ సాగుతూ ఉదయిస్తూ ఉద్భవిస్తూ అస్తమిస్తూ అధిరోహిస్తూ ప్రయాణిస్తున్నాడు 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమలేని ఖర్చులతో నేటి కార్యాలు సాగుతున్నాయి

శ్రమలేని ఖర్చులతో నేటి కార్యాలు సాగుతున్నాయి 

కార్యాలన్నీ యంత్రాలతో వాహనాలతో సాగుతున్నాయి
యంత్రం నుండే ఖర్చులు లావాదేవీలు సాగుతున్నాయి 

పుస్తకాలు చదువులు జ్ఞాపకాలు అనుభవాలు ఊహా భావాలు అన్నీ యంత్రాలుగా వివిధ చిత్రీకరణాలుగా సాగుతున్నాయి 

శ్రమించే వారు క్రింది స్థాయిలో ఉన్నారు శ్రమతో పోరాడుతున్నారు యంత్రాలను పరికరాల వాడుకను కూడా శ్రమతో సాగిస్తున్నారు 

యంత్రాలను వాహనాలను వివిధ పరికరాలతో శ్రమిస్తూ మరమ్మత్తులను సాగిస్తున్నారు 

వస్తువులను వస్త్రాలను పరికరాలను నిర్మాణములను యంత్రాలను వాహనాలను వివిధ రకాలుగా వాడుకలో ఉపయోగించే వాటిని పరిశుద్ధం చేయుటకు ఎంతగానో వివిధ రకాల పనిముట్లతో శ్రమిస్తున్నారు 


--  వివరణ ఇంకా ఉంది! 

Monday, March 2, 2026

ప్రతి పదాన్ని ప్రతి మాటను గొప్ప భావంతో మహా తత్వంతో ఉన్నతంగా గమనించు

ప్రతి పదాన్ని ప్రతి మాటను గొప్ప భావంతో మహా తత్వంతో ఉన్నతంగా గమనించు 

పదాల ఉచ్చారణ పరమార్థమై ఉండాలి మాటల సంభాషణ పరిపూర్ణమై సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

పొదుపులే గృహ ప్రవేశానికి తలుపులుగా ఆహ్వానం పలుకుతాయి

ఈనాటి పొదుపులే రేపటి గృహ ప్రవేశానికి తలుపులుగా ఆహ్వానం పలుకుతాయి  

పొదుపుకై ఒక్క రూపాయి నుండి మొదలు పెడితే గృహానికి కోటి రూపాయల వరకు పెరుగుతూ సాగుతూ వేగవంతమై వస్తాయి (కష్టాన్ని ఆరోగ్యాన్ని గమనించు ప్రశాంతంగా జీవితాన్ని సాగించు శ్వాస ప్రయాసను ను ఊరడించు)

పొదుపు ఆరంభమే ఆలస్యం గృహ ప్రారంభం తక్షణమే తలుపుల ద్వారాలతో వేచి ఉన్నాయి 

పొదుపు ఆరంభం కష్టమైనా గృహ ఆరంభం తలుపులు సంతోషాన్ని ఆనందాన్ని జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుతాయి 

గృహారంభం కుటుబంతో పాటు వంశానికి తరతరాలుగా అభివృద్ధిని కలిగిస్తాయి  అలాగే ఆరోగ్యం విజ్ఞానం నైపుణ్యం ప్రశాంతత అనుబంధం సంబంధం ప్రకృతి అనుకూలత పంచభూతాల సాఫల్యత మొదలైనవి ఎన్నో ఎన్నెన్నో ఎందరికో కలిగిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

తెలియని వారికి తెలియని తనం ఎందుకో

తెలియని వారికి తెలియని తనం ఎందుకో 
తెలిసిన వారికి తెలిసిన తనం ఎందుకో  

చేసే కార్యం తెలియకున్నా చేసేందుకు ప్రయత్నించుట ఒక గొప్ప భావమే 
చేసే కార్యం తెలిసినా సాగించే కార్య ప్రయత్నం ఒక గొప్ప విజయమే 

చేసే కార్యములు మంచి కార్యములైతే శుభములెన్నో కలుగుతూ ఎన్నో  విజయాలుగా సాగేనుగా 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, March 1, 2026

అనారోగ్యంతో జీవిస్తున్న నీవు ఈ లోకంలో లేవుగా

అనారోగ్యంతో జీవిస్తున్న నీవు ఈ లోకంలో లేవుగా 


-- వివరణ ఇంకా ఉంది! 

పొదుపులే లేనప్పుడు వస్త్రాభరణాల ఖర్చులు ఎందులకో

పొదుపులే లేనప్పుడు వస్త్రాభరణాల ఖర్చులు ఎందులకో 


-- వివరణ ఇంకా ఉంది1