అమృతాన్ని ఆహారంగా సేవించినా దుర్వాసన అలవాట్లను మానుకోలేరు
నోటిలో ఎప్పుడూ నమలడం దుర్వాసన ప్రతి క్షణం కలుగుతూనే ఉండాలి
ఎందుకు తింటారో తాగుతారో గుంపులు గుంపులుగా దుర్వాసనలతోనే
మతి పోయేదాక తాగి పడిపోయి మురికి కాలువలలో నిద్రించేవారు ఎందరో
చెత్తగా ఉన్నా అక్కడే తాగడం పొగ వదలడం కలుషితంగా జీవించడం
మద్యం సేవించి ఆవేదన చెంది చెత్తగా మాట్లాడటం ఎన్నో అజ్ఞానకరం
ఇలాంటి వారు నరకంలో ఉన్నా మానలేరు మంచిగా జీవించలేరు
మేధస్సు అజ్ఞానకరమైన లోపంతో జనిమించినట్లు ఉంటుంది
అమృత రుచిని తెలుసుకోండి సమయాన్ని గొప్పగా ఉపయోగించుకోండి
సంగీతాన్ని వినండి ప్రకృతిని ఆశ్వాదించండి చిత్రాలను తిలకించండి
శ్వాసను గమనించండి ఆకాశాన్ని చూడండి ఆహార అమృతాన్ని భుజించండి
అజ్ఞాన దురలవాట్లతో జీవించే వారికి ఇక ఏనాటికి మానవ జన్మ రాకపోవచ్చు
మరణంలేని అమృతాన్ని సేవించినా దురలవాట్లు ఉంటే కాలమే మరణింపజేస్తుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion