11, ఫిబ్రవరి 2020, మంగళవారం

ఎవరిని నీవు స్మరించెదవు ఎవరిని నీవు ధ్యానించెదవు

ఎవరిని నీవు స్మరించెదవు ఎవరిని నీవు ధ్యానించెదవు
ఎవరిని నీవు జపించెదవు ఎవరిని నీవు పరిశోధించెదవు

ఎవరిని నీవు నడిపించెదవు ఎవరిని నీవు తపించెదవు
ఎవరిని నీవు తిలకించెదవు ఎవరిని నీవు పూజించెదవు  || ఎవరిని ||

జీవకారుడనే నీవు జపించెదవా
లయకారుడనే నీవు లిఖించెదవా
నిత్యకారుడనే నీవు పూజించెదవా

సర్వకారుడనే నీవు గమనించెదవా
విశ్వకారుడనే నీవు పరిశోధించెదవా
భవకారుడనే నీవు బహుమానించెదవా  || ఎవరిని ||

ఓంకారుడనే నీవు స్మరించెదవా
దైవకారుడనే నీవు దర్శించెదవా
నిర్మలకారుడనే నీవు తపించెదవా

విజ్ఞానకారుడనే నీవు తిలకించెదవా
త్రినేత్రకారుడనే నీవు విశ్వసించేదవా
ఆద్యంతకారుడనే నీవు ధ్యానించెదవా  || ఎవరిని || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి