12, మార్చి 2020, గురువారం

భాషణం సంభాషణం

భాషణం సంభాషణం 
భూషణం సంభూషణం

భాషితం సంభాషితం
భూషితం సంభూషితం

పదాలతో వ్యాకరణం భాషితం సంభాషితం
వాక్యాలతో వ్యాసకరణం భూషితం సంభూషితం  || భాషణం ||

పదాల అర్థాలకు భాషణమే పదార్ధం
వాక్యాల అర్థాలకు భూషణమే వ్యాసార్థం

భాష భావాలకు ఉచ్ఛారణయే ఉత్కంఠం
భాష తత్వాలకు ఉత్పన్నమే ఉజ్జీవనం     || భాషణం ||

అక్షరాలకు శబ్దార్థాలే పదాల సంయుక్తం
అక్షరాలకు శరణార్థమే పదాల సంకలనం

భాషలకు భావార్థమే ప్రథమ ప్రదర్శనం
భాషలకు సర్వార్థమే ప్రముఖ ప్రావీణ్యం  || భాషణం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి