10, మార్చి 2020, మంగళవారం

అమరమో అమర బ్రంహమో

అమరమో అమర బ్రంహమో
అమృతమో అమృత భవ్యమో

మధురమో మధుర మోహమో
మాధుర్యమో మాధుర్య మేఘమో

భాషితమో భాషిత భాగ్యమో
భవితమో భవిత భవిష్యమో

అఖండములను అపేక్షించు కైలాస శిఖరమో
అభయములను ఆకర్షించు మానస సరోవరమో 
అవతారములను అన్వేషించు మానవ స్వరూపమో  || అమరమో ||

లిఖించు నా వాక్యములు ఆలకించు అనుబంధములు
స్వరించు నా కావ్యములు ఆవిష్కరించు అభాషణములు

ప్రభవించు నా వేదములు ఆవిర్భవించు సుభాషితములు 
ఉద్భవించు నా రాగములు అనుగ్రహించు పురస్కారములు

విస్తరించు నా గీతములు అనుసంధించు అనురాగములు
ఆదరించు నా గాత్రములు అధిరోహించు అపూర్వాదములు  || అమరమో ||

స్మరించు నా గుణములు ఆశ్రయించు అనిర్వచనములు
శృతించు నా గానములు అనుభవించు అసంభవ్యములు 

ఉచ్చరించు నా పదములు అంతర్భవించు అనివార్యములు
ఉత్కంఠించు నా నాదములు అంతర్గతించు ఆభరణములు

ధ్యానించు నా చరణములు ఆదర్శించు అభ్యాసములు 
యోచించు నా సత్యములు అనుసరించు అధ్యాయములు  || అమరమో || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి