30, మే 2025, శుక్రవారం

సుఖించుటకు అవకాశం కలగనవసరం లేదు శ్రమించుటకు అవకాశం కలిగేందుకు అవసరమున్నది

సుఖించుటకు అవకాశం కలగనవసరం లేదు శ్రమించుటకు అవకాశం కలిగేందుకు చాలా అవసరమున్నది  

సుఖించుటకు ఖాళి సమయం ఎలాగైనా కలుగుతుంది 

శ్రమించుటకు ఎన్ని విధాలైన ఏ సందర్భమైనను ముఖ్య అవసరం ఉన్నది 
సమయాన్ని శ్రమించుటకు ఉపయోగించుకొనుటలోనే విజ్ఞానం నవ ప్రజ్ఞాన పరిశోధన ఉత్తేజం ఉన్నది  

శ్రమించుటలో విజ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఆరోగ్యం గౌరవం అనుభవం అభివృద్ధి ఉన్నది 

శ్రమించుటలో కొత్త విజ్ఞానం కలగడంతో పాటు సమస్యలు వివిధ నైపుణ్యాలతో వివిధ అనుభవాలతో పరిష్కారమౌతాయి 

శ్రమించుటలో ఎన్నో విధానాలు ఉన్నాయి - నిరంతరం చదవడం నేర్చుకోవడం జ్ఞాపకశక్తిని పెంచుకోవడం అనుభవాల నుండి కొత్త పరిశోధన విజ్ఞానాన్ని సేకరించడం అజ్ఞానాన్ని వదిలించుకోవడం ఇలా ఇన్నో కలుగుతాయి 
అలాగే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి - జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చు  - అందరికి సమాజానికి విజ్ఞాన జీవన విధాన మార్గదర్శకం కావచ్చు 

సమాజంలో కలిగే అజ్ఞానాన్ని కూడా గుర్తించి భవిష్యత్లో కలగకుండా మార్పు తీసుకురావచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion