27, అక్టోబర్ 2017, శుక్రవారం

ఎవరికి ఏదో జరగాలి కాలంతో సాగిపోవాలి

ఎవరికి ఏదో జరగాలి కాలంతో సాగిపోవాలి
ఎవరికి ఏదో అవ్వాలి క్షణాలతో కొనసాగాలి

ఎందరితో ఏదో జరిగిపోవాలి సమయంతో గడిచిపోవాలి
ఎందరితో ఏదేదో తరిగిపోవాలి క్షణాలతో వదిలిపోవాలి   || ఎవరికి ||

ఎవరు ఏది కలిగించినా కరుణతో కరిగిపోవాలి
ఎవరు ఏది వదిలించినా దయతో మరిగిపోవాలి

ఎందరో వస్తారు ఏదో చేస్తారు ఏదో ఇచ్చివెళ్ళిపోతారు
ఎందరో ఉంటారు ఏదో అంటారు ఎంతో తీసుకెళ్తారు   || ఎవరికి ||

ఎవరికి ఏదో అవుతుంది ఏదో ఆగిపోతుంది
ఎవరికి ఏదో వస్తుంది ఏదో వెళ్ళిపోతుంది

ఎవరికి ఏది జరగాలో కాలమే తెలపాలి
ఎవరికి ఏది కలగాలో క్షణమే తపించాలి   || ఎవరికి ||

ఎవరికి ఏమైనా సుఖానందమే కలగాలి
ఎవరికి ఏదైనా శుభానందమే వరించాలి

ఎవరికి ఎంతైనా లాభమే సర్వానందమై సాగాలి
ఎవరికి ఎలైనా సంతోషమే నిత్యానందమై చేరాలి   || ఎవరికి || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి