13, అక్టోబర్ 2017, శుక్రవారం

పరమానంద రూపం పరంజ్యోతి స్వరూపం మహా దివ్య పవిత్రం

పరమానంద రూపం పరంజ్యోతి స్వరూపం మహా దివ్య పవిత్రం
పరమానంద భావం పరంజ్యోతి స్వభావం మహా విద్య పరిశుద్ధం

పరంధామ వేదం పరమాత్మ వేదాంతం మహా దివ్య పరిశోధనం
పరంధామ జ్ఞానం పరమాత్మ విజ్ఞానం మహా విద్య పర్యవేక్షణం   || పరమానంద ||

వేదాంత వేదం జీవ తత్వం మహా విజ్ఞాన పరిశోధనం
రూపాంత రూపం సత్య భావం మహా ధర్మ పర్యవేక్షణం

మహా మందిరం ఆనంద నిలయం ప్రకృతి క్షేత్రం పరమ పవిత్రం
మహా భువనం ప్రశాంత ఆలయం జగతి శిఖరం పరమ పరిశుద్ధం   || పరమానంద ||

సర్వానంద రూపం నిత్య స్వరూపం మహానంద భావం
సర్వానంద తత్వం నిత్య స్వభావం మహానంద భాగ్యం

నిత్యానంద జీవం పరమ పవిత్రం మహా పరిశోధనం
నిత్యానంద దైవం పరమ పరిశుద్ధం మహా పర్యవేక్షణం  || పరమానంద ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion