13, అక్టోబర్ 2017, శుక్రవారం

ఆత్మగా ఎదిగాను చూడు పరమాత్మగా ఒదిగాను చూడు

ఆత్మగా ఎదిగాను చూడు పరమాత్మగా ఒదిగాను చూడు
శ్వాసగా ఎదిగాను చూడు పర ధ్యాసగా ఒదిగాను చూడు

ఆత్మగా జీవమై ఎదుగుతూ పరమాత్మగా శ్వాసనై ఒదుగుతూ ఉదయిస్తూనే ఉన్నా
ఆత్మగా ధ్యాసనై ఎదుగుతూ పరమాత్మగా ధ్యానమై ఒదుగుతూ జీవిస్తూనే ఉన్నా   || ఆత్మగా ||

ఆత్మగా జీవమై ఉన్నా పరమాత్మగా ప్రకృతినై విశ్వమంతా ఎదుగుతున్నా
ఆత్మగా ధ్యాసనై ఉన్నా పరమాత్మగా ఆకృతినై జగమంతా ఒదుగుతున్నా

ఆత్మగా నిత్యం సర్వాంతర్యామినై పరమాత్మగా పరంధామనై ఎదుగుతున్నా
ఆత్మగా సత్యం విశ్వాంతర్యామినై పరమాత్మగా పరంజ్యోతినై ఒదుగుతున్నా   || ఆత్మగా ||

ఆత్మగా ఆనందమైనా పరమాత్మగా పరమానందమైనా ఎదగాలనే ఉన్నా
ఆత్మగా మహా శాంతమైనా పరమాత్మగా ప్రశాంతమైనా ఒదగాలనే ఉన్నా

ఆత్మగా అనుబంధమైనా పరమాత్మగా అనుభవమైనా కాలంతో ఎదగాలనే ఉన్నా
ఆత్మగా అణువు ఐనా పరమాత్మగా పరమాణువు ఐనా క్షణంతో ఒదగాలనే ఉన్నా   || ఆత్మగా ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion