14, అక్టోబర్ 2017, శనివారం

ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు

ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు
తీసుకోవాలనుకున్నా తీసుకోలేవు

ఇచ్చేది ఎవరో తీసుకునేది ఎవరో
జీవించేంతవరకే ఇవ్వడం తీసుకోవడం  || ఇవ్వాలనుకున్నా ||

ఉన్నప్పుడు ఇచ్చేస్తేనే ఎంతో ఉపయోగం
అవసరమైనప్పుడు ఇస్తేనే సద్వినియోగం

మరణించే సమయాన ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి
మరణించే సమయాన తీసుకోవాలనుకున్నా తీసుకోలేని స్థితి

ఇవ్వాలనుకున్నా తీసుకునేవారు లేకపోతే నిరుపయోగం
తీసుకోవాలనుకున్నా ఇచ్చేవారు లేకపోతే నిష్ప్రయోజనం   || ఇవ్వాలనుకున్నా ||

సహాయంగా ఇవ్వలేకపోయినా బాధ్యతగా ఉన్నప్పుడే ఇచ్చేయాలి
ఉచితంగా ఇవ్వలేకపోయినా తిరిగి ఇచ్చేలా సహాయంగా ఇవ్వాలి

భాగంగా ఇవ్వాలనుకున్నది అవసరాలకు ఉన్నప్పుడే ఇచ్చేయాలి
బాధ్యతగా తీసుకోవాలనుకున్నది ఉపయోగం ఉన్నప్పుడే తీసుకోవాలి

ఇవ్వడం తీసుకోవడం ఆరోగ్యాంగా జీవిస్తున్నప్పుడే జరిగిపోవాలి
ఇవ్వడం తీసుకోవడం ఉపయోగంగా అవసరాలతో గడిచిపోవాలి   || ఇవ్వాలనుకున్నా || 

తీసుకోవడానికి అడగాలి ఇవ్వడానికి తెలపాలి
తీసుకోవడం అడగడమే ఇవ్వడం తెలపడమే

తరతరాలకు మించిన ఆస్తులను బాధ్యతగా సరైన భాగంగా అవసరాలకు ఉన్నప్పుడే పంచుకోండి
తరతరాలకు మించిన ఆస్తులను అనుభవించేవారు లేకపోతే ఎందరినో ఉన్నప్పుడే ఆదుకోండి      || ఇవ్వాలనుకున్నా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి