Thursday, October 10, 2024

ప్రతి మనిషి [మానవుని] విజ్ఞానం ఏనాటికైనా ఎంతటిదైనా శూన్యమే

ప్రతి మనిషి [మానవుని] విజ్ఞానం ఏనాటికైనా ఎంతటిదైనా శూన్యమే  

నేడు నేర్చినది రేపటికి ఉపయోగం ఉండకపోవచ్చు లేదా ఉపయోగించుటకు అవకాశం కలగకపోవచ్చు 

మేధస్సులో ఉన్న విజ్ఞానాన్ని ఉపయోగించకపోవచ్చు లేదా సరైన రీతిలో వాడకపోవచ్చు 

నేర్చుకునే లేదా పరిశోధించే విజ్ఞాన సామర్థ్యం ఉన్నా అనుభవించే సమయం కలగకపోవచ్చు శరీరం సహకరించకపోవచ్చు 

ఎంత విజ్ఞానం ఉన్నా మరణంతో శూన్యమే 
నీలో ఉన్న విజ్ఞానాన్ని ఇతరులకు తరతరాలుగా ఉపయోగపడేలా సరైన రీతిలో బోధించు

సాధారణ సహజ శాస్త్రీయ సిద్ధాంతాల విజ్ఞానమే నిత్యం జీవించుటకు ప్రవర్తనకు పరిశుద్ధతకు ఉపయోగకరం ప్రధానంగా అవసరం 

ప్రకృతిని పరిశుద్ధించే అభివృద్ధించే విజ్ఞానమే ప్రధానం ప్రయోజనం తరతరాలకు ప్రజ్ఞానం 

No comments:

Post a Comment