14, సెప్టెంబర్ 2017, గురువారం

జీవించలేను నేను మరణించలేను నేను

జీవించలేను నేను మరణించలేను నేను
ఏనాటిదో ఈ ప్రయాణం నే సాగించలేను

సమస్యగా సాగిపోలేను సమస్యతో ఓడిపోలేను
సాధనగా సాగేదను సాధ్యమైతే శ్రమించగలను   || జీవించలేను ||

అఖండమైన రూపాలనే జగతిలో సృష్టించగలను
అమోఘమైన భావాలనే విశ్వతిలో తిలకించగలను

అసంఖ్యాక భావాల స్వభావాలతో కార్యాలనే గమనించగలను
అనంతమైన బంధాల తత్వాలతో స్వరాలనే శృతించగలను   || జీవించలేను ||

నిలిచిపోయే మహా భావాలకు స్వభావాలను తెలుసుకోగలను
కలిసిపోయే మహా సంబంధాలకు తత్వాలను తెలుపుకోగలను

యుగాలుగా జీవిస్తున్నా అనంత స్వభావాలతో జీవించలేను
తరాలుగా సాగుతున్నా అనేక సంబంధాలతో మరణించలేను   || జీవించలేను || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి