నీ మేధస్సులోని భావ తత్త్వాలు గుణ లక్షణాలై విశ్వమంతా వ్యాపించేలా ఉండాలి నిరంతరం ఆచరణతో సాగిపోవాలి
నీ గుణ లక్షణాలు నీ పరిధిలోని ఉండిపోతే వాటి యొక్క భావ తత్వాలు సామాన్యమైనవిగా నీ యందే ఉండిపోతాయి
భావ తత్వాలలో ఆలోచనల యొక్క గొప్పతనం విజ్ఞానం అపారమైన సుగుణత్వాలు సుప్రవర్తన విధానాలు దాగి ఉంటాయి
విజ్ఞానం మేధస్సులో ఉంటే గొప్పవాడివి కాలేవు విశ్వమంతా వ్యాపిస్తూ దానిని ఆచరిస్తూ ఉంటే నీ గొప్పతనం పరిశోధనమై పరిశుద్ధమై జీవిస్తూ సాగిపోతుంది
నీ భావ తత్వాలు ఇతరులకన్నా చాలా గొప్పవిగా ప్రయోజనకరంగా ఉంటేనే విశ్వమంతా వ్యాపిస్తాయి నీ విజ్ఞానం ఎన్నో తరాల వారి మేధస్సులలో ఆచరణతో సాగిపోతూనే ఉంటాయి జీవనోపాధిని కలిగిస్తాయి
-- వివరణ ఇంకా ఉంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion