10, నవంబర్ 2017, శుక్రవారం

ఓ మహాత్ముడే ఉదయించాలని తపించెదరు ఎందరో

ఓ మహాత్ముడే ఉదయించాలని తపించెదరు ఎందరో
ఓ మహర్షియే అవతరించాలని జపించెదరు ఎందరో   || ఓ ||

ఎంతగా ఎదిగినా అంతగా ఒదిగే సహ జీవుడే జన్మించునా
ఎంతలో వెలిసినా అంతలో వెలిగే శ్రీ నాధుడే ప్రభవించునా

ఎంతగా ఉందయించినా అంతగా అవతరించునా ఓ మహాత్ముడు
ఎంతగా అస్తమించినా అంతగా అధిరోహించునా ఓ మహానుభావుడు  || ఓ ||

ఎవరని తలచినా ఏమని తలచినా విజ్ఞానమే కలిగించునా
ఎంతని తపించినా ఏదని తపించినా వేదాంతమే తోచునా

ఎవరికి వారని పలికించినా ఎంతటి వారని పరీక్షించినా పరిపూర్ణమే
ఎక్కడి వారని అన్వేషించినా ఏనాటి వారని పరిశోధించినా ప్రజ్ఞానమే  || ఓ ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి