23, నవంబర్ 2017, గురువారం

సువర్ణాలనే విశ్వతిలో మరచిపోయా

సువర్ణాలనే విశ్వతిలో మరచిపోయా
సుగంధాలనే జగతిలో మరచిపోయా 

సువర్ణాల స్వరూపాలను తలచలేకపోయా
సుగంధాల సౌఖ్యతాలను తపించలేకపోయా  || సువర్ణాలనే ||

స్వరూపాల వర్ణ భావాలను గమనించలేక పోయా
సౌఖ్యాతల గంధ తత్వాలను ఆరాధించలేక పోయా

జీవన కార్యాలతో జీవిత సమస్యలతో ఇమిడిపోయా
జీవన భారాలతో జీవిత లోపాలతో మిళితమైపోయా   || సువర్ణాలనే ||

గమనంలేని ధ్యాసతో సువర్ణాలను గమనించలేక పోయా
చలనంలేని స్పృహతో సుగంధాలను చలించలేక పోయా

ప్రకృతిపై ధ్యాస తోచక సూర్యోదయ సువర్ణ భావాలనే మరచిపోయా
ఆకృతిపై స్పృహ లేక సూర్యాస్తమ సుగంధ తత్వాలనే విడిచిపోయా  || సువర్ణాలనే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి