29, నవంబర్ 2017, బుధవారం

ఎవరికి కలగలేదా మహా భావన

ఎవరికి కలగలేదా మహా భావన
ఎవరికి తోచలేదా మహా తత్వన

ఎన్నడు తలచలేదా విశ్వ వేదన
ఎన్నడు పలకలేదా విశ్వ జ్ఞానాన  || ఎవరికి ||

ఆఖర్వమైన తత్వాలు అద్భుత బంధాలు
అఖండమైన స్వభావాలు ఆశ్చర్య వేదాలు

అఖిలమైన భావాలోచన ఆనందకరమైన జీవ యోగములు
అమోఘమైన తత్వాలోచన సంతోషకరమైన దైవ భోగములు  || ఎవరికి ||

విశ్వతిని ప్రకృతి ఆవరణముగా తిలకించుటలో కలిగేను మహా సుందర భావాలు
జగతిని ఆకృతి నిర్మాణముగా అపేక్షించుటలో తోచేను మహా సుమధుర తత్వాలు

విశ్వతిని శ్వాసతో ప్రకృతిగా స్వీకరించుటలో నీలోనే లీనమయ్యేను వేద బంధాలు
జగతిని ధ్యాసతో ఆకృతిగా ఆస్వాదించుటలో నీలోనే లయమయ్యేను జ్ఞాన యోగాలు  || ఎవరికి ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి