11, నవంబర్ 2017, శనివారం

ప్రయాణించెదవా సూర్యోదయాన ప్రయాణించెదవా సూర్యాస్తమున

ప్రయాణించెదవా సూర్యోదయాన ప్రయాణించెదవా సూర్యాస్తమున
నిత్యం ప్రయాణించుటలో నీకు అలసట లేదుగా ఆకలి కలగదుగా  || ప్రయాణించెదవా ||

తరతరాలుగా ప్రయాణిస్తూనే యుగయుగాలుగా సాగుతున్నా
గతమంతా ప్రయాణిస్తూనే భవిష్యత్తుకై నిత్యం నీ ప్రయాణమే

ఆసక్తిగా సాహసం చేసే నిరంతర అధ్యాయము నీ ప్రయాణమే
స్వశక్తిగా సాధన చేసే నిత్యం అనుచరణ నీ ప్రయాణ మార్గమే  || ప్రయాణించెదవా ||

శూన్యంతో మొదలై క్షణాలతో కాలంగా సాగే నీ ప్రయాణమే విశ్వాంతరము
క్షణంతో ఆరంభమై సమయాలతో సాగే నీ ప్రయాణమే బ్రంహాండతరము

కార్యాలతోటి కాలాన్ని నడిపించే సూర్య చంద్రుల ప్రభావాల ప్రయాణం నీ మార్గము
ప్రణాళికలతోటి సమయాన్ని కలిగించే కార్యకలాపాల జీవుల ప్రయాణం నీ చలనము  || ప్రయాణించెదవా ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion