23, నవంబర్ 2017, గురువారం

విశ్వమంతా నీవే ఆవహించినావు ప్రభూ

విశ్వమంతా నీవే ఆవహించినావు ప్రభూ
జగమంతా నీవే అధిరోహించినావు ప్రభూ

సూర్యోదయంతో సర్వం నీవే ఆవహించినావు
సూర్యాస్తమంతో నిత్యం నీవే అధిరోహించినావు   || విశ్వమంతా ||   

విశ్వమంతా ప్రకృతితో పర్యావరణమై నిలిచి ఉన్నావు
జగమంతా ఆకృతితో అంతరిక్షమై విస్తరించి ఉన్నావు 

విశ్వమంతా ఎన్నో రూపాలతో పంచ భూతాలుగా ఎదిగున్నావు
జగమంతా ఎన్నో ఆకారాలతో పంచ తత్వాలుగా ఒదిగున్నావు   || విశ్వమంతా ||

పరమాత్మగా విశ్వమంతా ప్రకృతిలో ఇమిడిపోయావు
మహాత్మగా జగమంతా ఆకృతిలో నిర్మితమై పోయావు

పరంధామగా నీవే పరిశోధనమై కాలంతో ప్రయాణమై పోయావు
పరంజ్యోతిగా నీవే పరిశీలనమై సమయంతో ప్రధానమై పోయావు   || విశ్వమంతా || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి