7, నవంబర్ 2017, మంగళవారం

కాలం తెలిపే భావాలను మేధస్సులోనే దాచేదవా

కాలం తెలిపే భావాలను మేధస్సులోనే దాచేదవా
సమయం తపించే తత్వాలను నీలోనే ఉంచెదవా

జీవితమంతా నీలోనే భావాలను దాచేలా మేధస్సును అమర్చెదవా
జీవితంలో ఏనాడైనా ఎవరికైనా తత్వాలను తెలిపేలా ఆలోచించావా  || కాలం ||

భావాల ఆలోచనలలో విశ్వ వేద విజ్ఞానం దాచుకున్నావా
తత్వాల స్వభావాలలో మహా ప్రజ్ఞానం అమర్చుకున్నావా

జీవించే వారికి మహోన్నతమైన ఆలోచనలను కలుగజేయలేవా
ఎదిగే వారికి వేద విశిష్ట వైజ్ఞానిక స్వభావాలను అందజేయలేవా    || కాలం ||

కాలమే నీకు తెలిపినా నీలోనే దాచినా ఉపయోగం ఎవరికి ఎలా
సమయమే నీకు అందించినా ఆచరణ అనుభవం ఎవరికి ఎలా

దైవమే నీకు వేద విజ్ఞాన తత్వాలను సమర్పించగా ఎవరికి తెలుపలేవా
ధర్మమే నీకు విశ్వ విజ్ఞాన భావాలను అందించగా ఎవరికి బోధించలేవా  || కాలం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion