1, జనవరి 2020, బుధవారం

భావాలతోనే ఉండవలెనని బ్రంహ జ్ఞానమే తెలిపేనా

భావాలతోనే ఉండవలెనని బ్రంహ జ్ఞానమే తెలిపేనా
తత్వాలతోనే ఉండవలెనని బ్రంహ వేదమే తెలిపేనా

తన్మయంతోనే ఉండవలెనని బ్రంహ నాదమే తెలిపేనా
తపస్వితంతోనే ఉండవలెనని బ్రంహ గానమే తెలిపేనా

జగమంతా విశ్వసించుటలోనే తెలిసేనా బ్రంహ జ్ఞాన వేద విద్యార్థ పరమార్థం  || భావాలతోనే ||

ఎన్ని భావాలను తలిచానో మేధస్సుకే అంతరంగమయ్యేను
ఎన్ని తత్వాలను తపించానో దేహస్సుకే అంతర్గతమయ్యేను

ఎన్ని వేదాలను పఠించానో మనస్సుకే అనంతమయ్యేను
ఎన్ని నాదాలను బోధించానో వయస్సుకే అసంఖ్యమయ్యేను

అనంతమైన భావ వేదాలను తత్వ నాదాలను బ్రంహ జ్ఞానమే తెలుపునా  || భావాలతోనే ||

ఎన్ని రూపాలను దర్శించానో మేధస్సుకే అంతర్భూతమయ్యేను
ఎన్ని గుణాలను పరిశోధించానో దేహస్సుకే అంతర్లిఖితమయ్యేను

ఎన్ని కీర్తనలను రచించానో మనస్సుకే అంతర్భావమయ్యేను
ఎన్ని కావ్యాలను లిఖించానో వయస్సుకే అంతర్తత్వమయ్యేను

అసంఖ్యమైన రూప గుణాలను కావ్య కీర్తనలను బ్రంహ వేదమే తెలుపునా   || భావాలతోనే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి