23, జనవరి 2020, గురువారం

ఏ అనుభూతితో నీవు ఎలా జీవించెదవూ

ఏ అనుభూతితో నీవు ఎలా జీవించెదవూ
ఏ పరభూతితో నీవు ఎలా ఉదయించెదవూ

ఏ సంభూతితో నీవు ఎలా సంభవించెదవూ
ఏ స్వయంభూతితో నీవు ఎలా అవతరించెదవూ

ఏ జ్ఞానంతో నీవు ఎలా ఏ భూతితో ప్రబోధించెదవూ  || ఏ అనుభూతితో ||

జీవించవా ఒక క్షణమైనా మధురానుభూతితో
గమనించవా ఒక క్షణమైనా సహసానుభూతితో

ధ్యానించవా ఒక క్షణమైనా నవసంభూతితో
దర్శించవా ఒక క్షణమైనా పరంభూతితో

పరిశోధించవా ఒక క్షణమైనా పంచభూతితో
పర్యవేక్షించవా ఒక క్షణమైనా పరభూతితో    || కవి రాజకే ||

అతిశయించవా ఒక క్షణమైనా విభూతితో
ఆశ్రయించవా ఒక క్షణమైనా సంభూతితో

అవతరించవా ఒక క్షణమైనా దివ్యభూతితో
అనుగ్రహించవా ఒక క్షణమైనా సానుభూతితో

జ్ఞానించవా ఒక క్షణమైనా మహాభూతితో
గ్రహించవా ఒక క్షణమైనా గ్రహభూతితో    || కవి రాజకే || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి