10, జనవరి 2020, శుక్రవారం

హితం మారుతున్నది నేటి కాలమున

హితం మారుతున్నది నేటి కాలమున
సత్యం మార్చుకున్నది నేటి సమయాన

వేదం తరుగుతున్నది నేటి కాలమున
నాదం తపించుతున్నది నేటి సమయాన

కార్యం ప్రయాసపడుతున్నది నేటి కాలమున
జ్ఞానం పరిశోధింపబడుతున్నది నేటి సమయాన  || హితం ||

ఉన్నతమై ఉన్నా కాలం అవినీతిగా చేరుతున్నది
ప్రముఖమై ఉన్నా సమయం అనర్థంగా సాగుతున్నది

నిస్స్వార్ధమై ఉన్నా కాలం స్వార్థంతో ఎదుగుతున్నది
నిశ్చలమై ఉన్నా సమయం ఆరాటంతో ప్రయాణిస్తున్నది  || హితం ||

సుగుణమై ఉన్నా కాలం వ్యర్థాలతో నడిపిస్తున్నది
పరమార్థమై ఉన్నా సమయం అర్ధాంతంతో కదులుతున్నది

దైవత్వమై ఉన్నా కాలం దారిద్రముతో వెళ్ళుతున్నది
సత్యత్వమై ఉన్నా సమయం దౌర్భాగ్యంతో వస్తున్నది  || హితం || 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion