3, అక్టోబర్ 2026, శనివారం

ఏ యంత్రంలో ఏ మంత్రం ఉందో ఏ మేధస్సుకు తెలుస్తుందో

ఏ యంత్రంలో ఏ మంత్రం ఉందో ఏ మేధస్సుకు తెలుస్తుందో 

ఒక్కొక్క యంత్రం ఒక్కొక్క విధంగా పని చేస్తుంది 
యంత్రం యొక్క పని తీరు విధానమే విజ్ఞాన మంత్రం 
యంత్రాన్ని తయారు చేసే వారికే ఆ యంత్ర మంత్ర విజ్ఞానం తెలుస్తుంది 

యంత్రాన్ని తయారు చేసే వారికి ఆ యంత్ర భాగాల అమరిక (యంత్రానికి కావలసిన భాగాలు అలాగే యంత్రాన్నీ అమర్చుటకు కావలసిన పరికరాలు పనిముట్లు) మరియు పని తీరు మరియు మరమ్మత్తు విధానం తెలుస్తుంది 

యంత్రాన్ని కనుగొన్న వారు సృష్టించిన వారు ఎన్నో ప్రయోగాలను చేసివుంటారు 
యంత్రం అనుకున్న విధంగా పని చేయగలిగేందుకు  ఎన్నో ప్రయోగాలు ఎన్నో విధాలా ఆలోచించి శ్రమించి విజ్ఞాన అనుభవాలను గ్రహించి ఉంటారు 
యంత్రం యొక్క పని తీరు మంత్రం తెలిస్తే యంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు వృత్తిగా చేసుకొని సంపాదన చేసుకోవచ్చు సౌకర్యం చేసుకోవచ్చు శ్రమ సమయాన్ని తగ్గించవచ్చు కార్యాలను సులభం చేసుకోవచ్చు 

యంత్రం యొక్క మరమ్మత్తు విధానం విజ్ఞానంగా తెలిస్తే యంత్రం పని తీరును మళ్ళీ సరి చేయవచ్చు సంపాదన చేసుకోవచ్చు వృత్తిగా మార్చుకోవచ్చు 

నేడు మహా యంత్రాలను తయారు చేసేందుకు నిర్మించేందుకు మరో యంత్రాలు కావలసి వస్తుంది 
నేటి కాలమున ఎన్నో యంత్రాలు ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో విధాలుగా సూక్ష్మ యంత్రం నుండి మహా యంత్రం వరకు సృష్టింపబడుతున్నాయి తయారు చేయబడుతున్నాయి ఉపయోగించబడుతున్నాయి 

యంత్రం పని తీరులో కొన్ని భవిష్య అవసరాలకు ఉపయోగపడాలంటే ఆధునిక విజ్ఞానంతో కొన్ని మార్పులు చేస్తూ  వివిధ రూపకల్పనలతో క్రొత్త యంత్రాలను నిర్మాణం చేస్తూ పాత యంత్రాలను ఉపయోగం లేకుండా చేస్తున్నారు 

-- వివరణ ఇంకా ఉన్నది!

2, అక్టోబర్ 2026, శుక్రవారం

విజ్ఞానాన్ని తెలుసుకున్నావు నేర్చుకున్నావు జ్ఞాపకంగా సాగిస్తున్నావు ఇక సంపాదన చేయడమే ఆలస్యం

విజ్ఞానాన్ని తెలుసుకున్నావు నేర్చుకున్నావు జ్ఞాపకంగా సాగిస్తున్నావు ఇక సంపాదన చేయడమే ఆలస్యం  

-- వివరణ ఇంకా ఉన్నది1

ఒక బంధం నుండి జన్మించి ఎదుగుతూ ఇంకొక బంధంతో కలిసి జీవిస్తూ ఎవరితో బంధం లేనట్లుగా అస్తమించెను

ఒక బంధం నుండి జన్మించి ఎదుగుతూ ఇంకొక బంధంతో కలిసి జీవిస్తూ ఎవరితో బంధం లేనట్లుగా అస్తమించెను 

తల్లి తండ్రుల నుండి జన్మను పొంది విజ్ఞానంతో ఎదుగుతూ కళ్యాణం చేసుకొని క్రొత్త బంధంతో జీవిస్తూ 
వృద్ధాప్యాన్ని పొంది ఎవరికీ బంధం లేనట్లు శరీరం అస్తమించేను 
  
ఎవరితో ఎంత కాలం జీవిస్తామో ఎలా విజ్ఞానంతో శ్రమిస్తామో ఎవరితో బంధం ఏర్పడుతుందో జన్మించుటలో (ఉదయించుటలో) అస్తమించుటలో సర్వం తెలియకుండా పోతుంది 

బంధం ఏర్పడినప్పుడే మరో బంధాన్ని సృష్టించి మరొక బంధాన్ని కలుపుతూ మరో బంధాన్ని సృష్టించి అలా బంధాలతో బంధాలను సృష్టించుకొని అనేక బంధాలు సాగుతూ కొన్ని బంధాలు అస్తమిస్తూనే సాగిపోతూ తరతరాలుగా యుగయుగాలుగా బంధాలు ఉన్నట్లుగా లేనట్లుగా వెళ్ళిపోతూనే ఉంటాయి 

ఏ బంధంతో ఉన్నా విజ్ఞానంతో ఎదుగుతూ శ్రమతో సంపాదన చేస్తూ బంధంతో జీవిస్తూ ఆరోగ్యంతో ఆనందంతో అభివృద్ధితో పరిశుద్ధతతో జీవిత పరమార్ధంతో సాగిపోవాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

1, అక్టోబర్ 2026, గురువారం

బంధమై కాలక్షేపం చేస్తూ జీవిస్తూ సాగిపోతే సంతోషం కలగదు

బంధమై కాలక్షేపం చేస్తూ జీవిస్తూ సాగిపోతే సంతోషం కలగదు సమస్యలు పెరుగుతూ పోతాయి 

బంధమై శ్రమిస్తూ విజ్ఞానంతో సంపాదన చేస్తూ సాగితే సమస్యలు ఎన్నైనా పరిష్కారమవుతూ నిత్యం తరతరాలకు ఉపయోగపడే సంతోషం ఆరోగ్యం ఆనందం కలుగుతుంది కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ సాగుతుంది 

శ్రమించే సంపాదనలో కలిగే సంతోషం శరీరానికే ఆరోగ్యం మేధస్సుకే సంతోషం మనస్సుకే ఆనందం దేహానికి ఉపశమనం జీవన విధానానికే మార్గదర్శకం జీవితానికే అభివృద్ధి పరమార్థం 

-- వివరణ ఇంకా ఉన్నది! 

యజమాని గొప్పగా మంచితనంతో ఉంటే శ్రామికుడిగా శ్రమించే వారు ఎవరైనా అభివృద్ధి చెందుతారు

యజమాని గొప్పగా మంచితనంతో ఉంటే శ్రామికుడిగా శ్రమించే వారు ఎవరైనా అభివృద్ధి చెందుతారు 


-- వివరణ ఇంకా ఉన్నది!

పరమాత్మా! మనిషిలోనే భగవంతుడు మానవత్వంతో లేడంటే ఇంకెక్కడ ఉండగలడు జీవించగలడు

పరమాత్మా! మనిషిలోనే భగవంతుడు మానవత్వంతో లేడంటే ఇంకెక్కడ ఉండగలడు జీవించగలడు  

మనిషిలో మానవత్వం లేకపోతే భగవంతుని స్వభావ తత్త్వాలు ఎలా తెలుస్తాయి ఎవరికి అర్థమవుతాయి 
మనిషిలో మానవ తత్త్వమే లేనప్పుడు భగవంతుడు ఎక్కడా కనిపించడు ఏ మహా కార్యం సహాయం జరగదు 

జీవించుటకే ప్రదేశం లేనప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది కుటుంబం ఎలా సాగిపోతుంది విజ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

ఆస్తులను ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసే విజ్ఞానం కుటుంబంలో ఉన్న వారందరికి ఉండాలి

ఆస్తులను ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసే విజ్ఞానం కుటుంబంలో ఉన్న వారందరికి ఉండాలి  

అనవసరమైన ఖర్చులను చేసే అజ్ఞానం కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలియకుండానే వస్తుంది 

శ్రమించలేని తత్త్వం పొదుపు లేని స్వభావం ఉన్నంతవరకు ఏ కుటుంబం ఏ నాటికి అభివృద్ధి చెందదు 

సమయోచితంగా ఆలోచించలేనివారే కాలక్షేపం చేస్తూ అనవసరమైన ఖర్చులు చేసుకుంటూ జీవితాన్ని శూన్యంలా ఎదుగుదల లేకుండా అజ్ఞానంతో సాగిస్తారు 

విజ్ఞానం అంటే శ్రమ సాధన లక్ష్యం సంపాదన సమయోచితం పర్యావరణం కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక నాణ్యత నైపుణ్యం 
జీవితం అంటే శ్రమ ఆరోగ్యం సౌభాగ్యం ఐశ్వర్యం ఆనందం కుటుంబం బంధుత్వం అభివృద్ధి పరిశుద్ధత ప్రకృతి  పునరావృత్తం 


-- వివరణ ఇంకా ఉన్నది!

30, సెప్టెంబర్ 2026, బుధవారం

యంత్రములతో మానవ మేధస్సులో పరిశోధనగా సాగే ఆలోచనలు శరీర సామర్థ్యములు తగ్గిపోతున్నాయి

యంత్రములతో మానవ మేధస్సులో పరిశోధనగా సాగే ఆలోచనలు శరీర సామర్థ్యములు తగ్గిపోతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!  

కాలక్షేపం కోసం శ్వాస సృష్టించబడలేదు జీవం అవతరించబడలేదు

కాలక్షేపం కోసం శ్వాస సృష్టించబడలేదు జీవం అవతరించబడలేదు 

నిరంతరం శ్రమతో విజ్ఞానంతో బంధాన్ని అభివృద్ధి చేసుకొనుటకు జీవ స్వరూపాలు అవతరించాయి 

ప్రకృతిని విజ్ఞానంతో ఉపయోగించుకుంటూ మన బంధాలను సమాజంతో వివిధ విజ్ఞాన కార్యక్రమాలతో సాగిపోవుటకు దేహ రూపాలు అవతరించబడ్డాయి  

-- వివరణ ఇంకా ఉన్నది!

సంపాదన మేధస్సును సక్రమంగా ఆరోగ్యంగా ఉత్తేజంగా సమయోచితంగా విజ్ఞాన నైపుణ్యంతో ఆలోచింపజేస్తుంది

సంపాదన మేధస్సును సక్రమంగా ఆరోగ్యంగా ఉత్తేజంగా సమయోచితంగా విజ్ఞాన నైపుణ్యంతో ఆలోచింపజేస్తుంది  

సంపాదన ఉంటే కార్యక్రమాలు ప్రతి రోజు సూర్యోదయ సమయానికి ఆరంభమై మేధస్సును సక్రమంగా ఆలోచింపజేస్తుంది కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తింపజేస్తుంది సమస్యలకు సమయోచిత పరిష్కారాలను అన్వేషిస్తుంది భవిష్య విజ్ఞానాన్ని పరిశోధన చేస్తుంది కుటుంబాన్ని జీవితాన్ని అన్ని రకాలుగా అభివృద్ధితో సాగిస్తుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!