5, అక్టోబర్ 2026, సోమవారం

సూర్యదేవా! ప్రతిరోజు ప్రతి ఇంటిలో ప్రవేశిస్తున్నావు

సూర్యదేవా! ప్రతిరోజు ప్రతి ఇంటిలో ప్రవేశిస్తున్నావు 

నీవు ప్రతి ఇంటిలో ప్రవేశించుటలో ప్రతి ఇంటి పరిస్థితి నీకు బాగా తెలిసివుంటుంది 

సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రతి ఇంటిలో వెలుతురుతో వారితోనే ఉంటావు  
ఏ ఇంటిలో ఆహారం ఆరోగ్యం విజ్ఞానం అనుభవం ఆనందం అనుబంధం అభివృద్ధి ఎలా ఉంటుందో నీవు గ్రహించివుంటావు 
ప్రతి రోజు ప్రతి ఇంటి పరిస్థితులను వెలుతురుతో గమనిస్తూ గ్రహిస్తూనే మౌనంగా సాగుతూ ఉంటావు 

నీ వెలుతురు ప్రతి ఇంటికి ఇంటిలో ఉన్నవారికి ఉత్తేజమై ఆరోగ్యమై సామర్థ్యమై కార్యక్రమాలను విజ్ఞానంగా సాగించేలా మెలకువ కలిగించాలి 
నీ వెలుతురు యొక్క ప్రయోజనం ప్రతి ఇంటిలో సమాజంలో ప్రపంచంలో జీవిస్తున్న వారందరికీ ప్రధానమైన ముఖ్యమైన అమూల్యమైన అపూర్వమైన సమయమై కార్యక్రమాలను విజ్ఞానంగా పరిశుద్ధంగా సామర్థ్యంతో సాగించాలి 

ప్రతి జీవికి ప్రతి అణువుకు నీవే మహా సామర్థ్యం నీవే మహా ఉత్తేజం నీవే మహా ప్రోత్సాహం నీవే మహా ధైర్యం 

నీవు లేని సమయం విశ్వానికే విశ్రాంతి సమయం విరామ సమయం నిద్రించే సమయం రేపటికి శరీర సామర్థ్యాన్ని ఆరోగ్యమైన పునరాభివృద్ధిగా చేసుకునే సమయం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion