11, అక్టోబర్ 2026, ఆదివారం

నీవు దేనిని ఉపయోగించుకుంటావో దానిని అభివృద్ధి చేసుకోవాలి

నీవు దేనిని ఉపయోగించుకుంటావో దానిని అభివృద్ధి చేసుకోవాలి  

శరీర సామర్థ్యం తగ్గిపోతే ఆహారం శరీరానికి ఎలా అందిస్తామో అలాగే మనం వాడుకున్న వాటిని అభివృద్ధి చేసుకుంటూ సాగిపోవాలి అప్పుడే మనకు మన అవసరాలకు మన జీవన విధానానికి జీవితానికి తరతరాలుగా సమృద్ధిగా పుష్కలంగా లభిస్తూనే ఉంటుంది మన ప్రయత్నంతో ప్రకృతి ఉద్భవింపజేస్తూనే సాగుతూ వస్తుంది 

మనం వాడిన ఫలాన్ని విత్తనం ద్వారా వృక్షంగా అభివృద్ధి చేసుకుంటూ సాగిపోతోనే ఫలాలు ఎల్లప్పుడూ లభిస్తూనే అభివృద్ధి చెందుతూనే అందరికి తరతరాలుగా అందుతూ ఉంటాయి ఉపయోగపడుతూనే ఉంటాయి 

మనం వాడే ఆహార పదార్థాలు వస్త్రాలు వస్తువులు సహజ వనరులను వాడుతూనే ఉండాలి అభివృద్ధి చేసుకుంటూనే ఉండాలి 

సహజ వనరులు ఉద్భవించకపోతే బంగారం (సువర్ణం) కన్నా గొప్పగా అందరికి అందుబాటులో ఉండేలా జీవన విధానానికి కావలసిన విధంగా అవసరంగా ఉపయోగించుకోవాలి అనవసరంగా అణువైనను వాడుకోరాదు వృధా చేయరాదు విజ్ఞాన నైపుణ్యంతో అనుభవంతో సురక్షితంగా ప్రయోజనకరంగా వాడుకోవాలి 

ఉద్భవించే  వనరులను తగినంతగా వృధా కాకుండా వాడుకోవాలి అభివృద్ధితో పునరుద్ధరణ (పునరాభివృద్ధి) చేసుకోవాలి 
విచ్చల విడిగా వాడుకుంటే వృధా అయిపోతుంది ధరలు పెరిగిపోతాయి ధనం లేనివారికి అందుబాటులో ఉండవు 

వాడుకున్న ప్రదేశాన్ని కూడా పరిశుద్ధంగా పరిమళంగా పవిత్రంగా ఉంచుకోవాలి అప్పుడే తరతరాల వారికి ఆరోగ్యమైన జీవన విధానం ఏకాగ్రత సామర్థ్యం విజ్ఞానం ప్రశాంతత కలుగుతూ జీవితాలు పరిపూర్ణంగా ప్రకృతి అభివృద్ధితో సాగుతాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion