16, అక్టోబర్ 2026, శుక్రవారం

ఉద్యోగం వస్తే సంపాదన కలుగుతుందని తెలిసినా శ్రమించుట లేదు

ఉద్యోగం వస్తే సంపాదన కలుగుతుందని తెలిసినా శ్రమించుట లేదు  
నేటి కాలములో శ్రమ సులభంగా యంత్ర సహాయములతో వివిధ కార్యాలతో సాగుతున్నాయి 

శ్రమించుటకు అహం (అహంకారం) ఉంటే జీవించుటలో నీవు సుఖించవచ్చేమో గాని కుటుంబం సంతోషంగా ఉండదు 
నీకు కుటంబం సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నా శ్రమించే వారికి తెలుస్తుంది కుటుంబం అసమర్ధతో సాగుతుందని 

నీ కార్యములను కూడా నీవు సరిగ్గా నిర్వర్తించుట లేదని నీ మేధస్సులో గమనం లేదు గ్రహించే స్తోమత లేదు 
నీలో ఉన్న విజ్ఞానం అజ్ఞానమై అనారోగ్యమై యంత్రాలతో కాలక్షేపంతో నీలోనే నీవుగా ఉన్నట్లు మరచిపోయి అయోమయంతో జీవిస్తున్నావు 

కొందరు ఖర్చు చేసేందుకే శ్రమిస్తారు (శ్రమ కూడా అనవసరమైన కాలక్షేప ఖర్చులకే) లేదంటే తమ దినచర్య కార్యాలను కూడా సరిగ్గా చేసుకోలేరు 

సంపాదన సర్వ కార్యములకు అధిపతి 
సంపాదన సర్వ సమస్యలకు పరిష్కారపతి 
సంపాదన సర్వ శుభములకు ఆరంభపతి 
సంపాదన సర్వ కార్యాలకు సామర్థ్యపతి 

సంపాదన ఆహారానికి ఆరోగ్యానికి ఐశ్వర్యపతి 
సంపాదన అభివృద్ధికి ఆనందానికి సంపూర్ణపతి 
సంపాదన విజ్ఞానానికి అనుభవానికి ప్రజ్ఞానపతి 

ఉద్యోగమైనా చేయాలి లేదా వ్యాపారమైనా చేయాలి అప్పుడే జీవితం శ్రమ విధ జీవన గౌరవ పరమార్థం సంస్కారం 

బంధం కూడా శ్రమలో భాగమైతేనే శ్రమ సంపాదనగా సంపూర్ణమైన ఆహార సామర్థ్య ఆరోగ్యంతో ఆయుస్సుతో కుటుంబం సంతోషంగా విజ్ఞానంగా అభివుద్ధితో ఐశ్వర్యంతో సాగుతుంది  

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion