ఐశ్వర్యం కోసమైనా సౌకర్యం కోసమైనా అవసరాల సమస్యల పరిష్కారముల కోసమైనా శ్రమించాలి సంపాదన చేయాలి అనే ఆలోచన కుటుంబం కోసం వృద్ధాప్యంలో తప్పకుండా కలుగుతుంది అలా కలగలేదంటే నీవు అజ్ఞానంతో జీవిస్తున్నావని తెలుస్తుంది లేదా కాలక్షేపమే నీ జీవన విధానమని అర్థమవుతుంది అలాగే సమస్యలను పెంచడమే గాని తగ్గించడం తెలియని విధంగా తెలుస్తుంది
సంపాదన లేకపోతే అనారోగ్యం అజ్ఞానం అనవసరమైన ఖర్చులు అనవసరమైన కార్యాలు చేసుకుంటూ ఇబ్బందులతో కుటంబాన్ని సాగించడం కాలక్షేపం చేయడమే జీవితమై పోతుంది
సూర్యోదయంతో విజ్ఞానంగా సామర్థ్యంగా మేల్కొని సంపాదన కోసం శ్రమిస్తూ సమాజంలో ప్రయాణిస్తూ జీవన విధానాన్ని గొప్పగా సాగించాలి సాధించాలి అలవాటు చేసుకోవాలి ప్రవర్తనగా మార్చుకోవాలి మార్గదర్శకంగా ఉండాలి
ఐశ్వర్యం ఉంటే అనంతం నీదే సంపాదన ఉంటే సమస్తం నీదే ఆరోగ్యం ఉంటే అనుభవం నీదే విజ్ఞానం ఉంటే విజయం నీదే - ఇలా సాగిపోవాలంటే శ్రమ సంపాదన నైపుణ్యం ఎల్లప్పుడూ అలవాటుగా సాగిపోతూ ఉండాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion