28, అక్టోబర్ 2026, బుధవారం

శ్రమించే వారి సామర్థ్యం కన్నా నీ సామర్థ్యం అధికంగా ఉన్నా కాలక్షేపంతోనే సాగుతూ శ్రమించలేక పోతున్నావు

శ్రమించే వారి సామర్థ్యం కన్నా నీ సామర్థ్యం అధికంగా ఉన్నా కాలక్షేపంతోనే సాగుతూ శ్రమించలేక పోతున్నావు  
అవసరాలు తీరకున్నా విలాసంగా జీవిస్తూ కాలక్షేపంతో కాలాన్ని వృధా చేస్తూ సమస్యలు తెలియకుండా జీవిస్తున్నావు శ్రమించే వారి ఖర్చులు సమస్యలు పెంచుతున్నావు 

శ్రమించే వారి సామర్థ్యం కన్నా నీ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పుడు నీవు శ్రమిస్తూ సంపాదన చేయగలిగితే స్వల్ప కాలంలోనే అవసరాలు తీరిపోయి సమస్యలు పరిష్కారమై సౌకర్యాలతో ఐశ్వర్యంగా సౌభాగ్యంగా జీవించగలవు 

విజ్ఞానం సమయం అభివృద్ధి ఆలోచన ఉన్నప్పుడు శ్రమిస్తూ సాధనతో సంపాదన చేస్తూ కుటుంబాన్ని అభివృద్ధితో సాగించాలి 

వయస్సు లేనప్పుడు వృద్ధాప్యంలో సంపాదించాలి శ్రమించాలి భోగభాగ్యాల సౌకర్యాలను పొందాలి అనే ఆలోచన  తప్పకుండా నీకు కలుగుతుంది నీ కోసం కాకపోయినా నీ కుటుంబం తరతరాలుగా సౌకర్యాలతో ఆరోగ్యంతో విజ్ఞానంతో సామర్థ్యంతో జీవించేందుకు నీకు సరైన ఆలోచన కలుగుతుంది ఆనాడు నీవు శ్రమించలేవు సహించలేవు సాధించలేవు సంపాదన చేయలేవు 

కాలక్షేపం అనారోగ్యం అనాభివృద్ధి అసౌకర్యం అజ్ఞానంతో సాగే సమస్యల జీవన విధానం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion