నేటి యంత్రములు మానవుల భాషలతో సంభాషించగలవు విజ్ఞానాన్ని అందించగలవు
యంత్రములలో మనకు కావలసిన భాషను అనుసంధానం చేస్తూ విజ్ఞాన మంత్రాన్ని అమర్చుతూ మనకు కావసిన విధంగా యంత్రములతో సంభాషిస్తూ కార్యక్రమాలను చేయించుకుంటున్నాము
యంత్రములలో ఒక మనిషికి తెలియని లేదా ఆలోచన కలగని విజ్ఞానాన్ని అమర్చుతూ ఏ మనిషికైనా ఏ సమస్యకైనా ఏదైన పరిష్కారం అవసరమైతే ఉపయోగపడేలా అనుసంధానం చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు వాడుకోవచ్చు
మానవుని జీవన విధానం మానవులతోనే కాకుండా యంత్రములతోనూ గొప్పగా అనేక రకాలుగా సాగుతున్నది
యంత్రాలను ఉపయోగించుకోవడం ఒక విజ్ఞాన కళ మంత్ర కళ ఆధునిక జీవన వృత్తి కళ ఎందరికో ఆధారమైన కళ
యంత్రములు కొందరికి కొన్ని కార్యాలను చేసిపెడుతుంది కొందరికి కాలక్షేపాన్ని ఇస్తుంది మరికొందరికి సంపాదనను ఇస్తుంది మరికొందరికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది మరికొందరికి ప్రమాదాన్ని కలిగిస్తుంది మరికొందరికి విజ్ఞానాన్ని అందిస్తుంది మరికొందరికి జీవన ఆధారమవుతుంది మరికొందరికి నష్టాన్ని కలిగిస్తుంది మరికొందరికి భయాన్ని కలిగిస్తుంది మరికొందరికి ప్రశాంతతను ఇస్తుంది మరికొందరికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion