20, అక్టోబర్ 2026, మంగళవారం

నడిచే వారికి దారి తెలుస్తుంది ప్రయాణించే వారికి మార్గం తెలుస్తుంది

నడిచే వారికి దారి తెలుస్తుంది ప్రయాణించే వారికి మార్గం తెలుస్తుంది 

నడిచే వారికి దారిలో ఎక్కడ ఏముందో ఎవరెవరు వస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది నడక సురక్షితంగా సాగుతుంది 
ప్రయాణించే వారికి మార్గంలో ఎక్కడ ఏముందో ఎవరెవరు వస్తారో స్పష్టంగా తెలియడానికి కాస్త సమయం పడుతుంది 

వాహనాలలో ప్రయాణించే వారికి మార్గం కనబడుతున్నా అన్నీ సమయ స్థితి పరిస్థితులతో మార్గం వెంట కలిగే వాటిని గమనించడానికి మానవ మేధస్సుకు అప్పుడప్పుడు సందేహంగా ఉన్నప్పుడు ప్రమాదాలు క్షణ కాలంలో కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి  
మానవ మేధస్సు ప్రయాణ వేగంతో సాగుతున్నప్పుడు క్షణ కాలంలో అన్నింటిని గ్రహించలేరు అకస్మాత్తుగా కలిగే ప్రమాదాలను తప్పించుకోలేదు 

నడిచే దారి దూరం తక్కువ సమయం ఎక్కువ - ఎన్నో విధాల సురక్షితం ఆలోచితం 
ప్రయాణించే మార్గం దూరం ఎక్కువ సమయం తక్కువ - చాలా విధాల ప్రమాదం వీక్షణీయం 

దారి ఎలా ఉంటే నడక అలాగే సాగుతుంది - మేధస్సు దారిని గ్రహించగలదు 
మార్గం ఎలా ఉంటే ప్రయాణం అలాగే సాగుతుంది - మేధస్సు మార్గాన్ని గ్రహించినా వాహనం వేగంతో సాగేటప్పుడు అదుపు తప్పగలదు నేత్ర దృష్టి ఆలోచన శక్తి అదుపు చేయలేక ప్రమాదాన్ని సృష్టించగలవు 

నడక దారి ప్రయాణం సాధారణమైనది - శరీర శక్తితో సాగుతుంది 
వాహన మార్గ ప్రయాణం వేగవంతమైనది  - వాహన శక్తితో సాగుతుంది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion