5, అక్టోబర్ 2026, సోమవారం

ఐశ్వర్యం లేదని ఆలోచిస్తున్నావా సంపాదన లేదని శ్రమిస్తున్నావా

ఐశ్వర్యం లేదని ఆలోచిస్తున్నావా సంపాదన లేదని శ్రమిస్తున్నావా  

ఐశ్వర్యం లేనప్పుడు సంపాదన చేయడమే ప్రధాన కర్తవ్యము 

ఐశ్వర్యం ఉన్నా లేకున్నా సంపాదన చేస్తూ ఉంటేనే రేపటి సమస్యలకు ఖర్చులకు తగినంతగా ఐశ్వర్యం ఉపయోగపడుతుంది 

రేపటి సమస్యల ఖర్చులతోనే సాగిపోతే అభివృద్ధి చెందేది ఎప్పుడు ఆనందంగా జీవించేది ఎప్పుడు 

ప్రశాంతమైన జీవితం వృద్ధాప్యంలో అయినా కలగాలంటే శ్రమిస్తూ సంపాదన చేస్తూ ఐశ్వర్యంతో అభివృద్ధి పొందుతూనే ఉండాలి 

వయస్సుతో సామర్థ్యంతో ఉత్తేజంతో ఉన్నప్పుడే శ్రమిస్తూ సంపాదన చేస్తూ ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి భవిష్య కాలంతో బంధాలతో ఆనందంగా జీవిస్తూ సాగేందుకు అవసరాలను సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలి 

విజ్ఞానాన్ని సామర్థ్యం చేసుకోవాలి సామర్థ్యాన్ని శ్రమించడం చేసుకోవాలి శ్రమను ఐశ్వర్య ఫలితం చేసుకోవాలి 
ఫలితాన్ని అభివృద్ధి చేసుకోవాలి అభివృద్ధిని అవసరాల సౌకర్యాలుగా మార్చుకొని ప్రశాంతతతో సాగిపోవాలి  


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion