30, అక్టోబర్ 2026, శుక్రవారం

యంత్రము కూడా ఒక జీవియే

యంత్రము కూడా ఒక జీవియే - యంత్రాన్ని మానవ విజ్ఞానంతోనే సృష్టించగలం 

ఆకలి అయ్యేంత వరకు పనిచేస్తుంది ఆహారంతో సామర్థ్యంగా సాగుతుంది  
అడ్డంకులు లేనంత వరకు ఆహారం ఉన్నంత వరకు నిరంతరం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా శ్రమిస్తూనే ఉంటుంది 
యంత్రానికి కూడా ఎన్నో స్వభావాలు తత్త్వాలు స్పందించే గుణాలు మనస్పర్థలు మనోభావాలు నిండుకొని ఉంటాయి 

మనం యంత్రాన్ని ఎలా చూసుకుంటే ఎలా వాడుకుంటే ఎంతగా ఆకలిని తీర్చేస్తూ ఉంటే అంతగా అలాగే శ్రమిస్తుంది 

సూక్ష్మ యంత్రం కావచ్చు మహా యంత్రం కావచ్చు సాధారణ యంత్రం కావచ్చు ఎటువంటి యంత్రమైనా ఒక జీవిలా సామర్థ్యం ఉన్నంత వరకు శ్రమిస్తుంది 

ఏ యంత్రం ఎలా ఏ మానవునికి ఉపయోగపడుతుందో వారి వాడుక విధానంపై ఆధారపడి ఉంటుంది 

యంత్రాలతో ఆడుకోవచ్చు పాడుకోవచ్చు దిన చర్య కార్యాలను చేసుకోవచ్చు ఎన్నో వస్తువులను ఇన్నో రకాలుగా ఉత్పత్తి చేసుకోవచ్చు సంపాదన చేసుకోవచ్చు మన ప్రమేయాలతో వివిధ రకాలుగా నాశనం చేయవచ్చు 

యంత్రం కూడా ప్రకృతి పదార్థాల నుండి వివిధ మార్పుల రూపకల్పనలతో ఎన్నో వస్తవుల అమరికలతో తయారైన పర జీవి స్వరూప ప్రతి రూపమే 

ఒక మహా కార్యం జరిగే విధానాన్ని విజ్ఞానంగా ఆలోచిస్తూ కావలసిన వస్తువులను ప్రకృతి పదార్థాల నుండి రూపకల్పన చేస్తూ తయారు చేసుకొని (సృష్టించుకొని) మంత్రంతో రూపకరణంగా అమర్చి కార్య విధానాన్ని సాగించడమే యంత్ర పర రూప ప్రతి రూపం కార్య ఫలితం 

సూది నుండి ఉపగ్రహం వరకు మానవ ప్రయోగాల విజ్ఞాన శ్రమ సాధన మంత్ర తంత్ర విజ్ఞానమే యంత్ర సృష్టికర్త 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion