పరమాత్మా! శ్రమించే వారి సమస్యలను పరిష్కారిస్తున్నావా సాధన చేసేవారి సమస్యలను పరిష్కారిస్తున్నావా
శ్రమించే వారిలో ఎందరికో కార్యఫలితం లేకుండా పోతున్నది సాధన చేసేవారిలో ఎందరికో కార్యఫలితం లభించకుండా పోతున్నది
అధికారులను ఏనాడు అడగలేము ప్రశ్నించలేము కుటుంబ బంధాల సమస్యలను చెప్పుకోలేము కార్యఫలితాన్ని నిండుగా అందించాలని తెలుపుకోలేము
కొందరి పై తరగతి అధికారులను చూడనే లేదు వారు ఎవరో తెలియనే లేదు కనీసం పేరు ఐనా తెలియనివ్వలేదు
కార్యఫలితాన్ని సక్రమంగా సరిగ్గా అందించాలని ఇవ్వాలని ఎవరికీ తెలుపుకోవాలో అర్థం కావటం లేదు
శ్రమ (పని కార్యం ఉద్యోగం) ఇచ్చేది ఒకరు కార్యఫలితాన్ని (శ్రమ ఫలితాన్ని) ఇచ్చేది ఒకరు
అధికారులకు శ్రమించిన వారి కార్మికులకు కార్యఫలితం అందిందో లేదో కూడా తెలియదు
నేటి ఆధునిక విజ్ఞానంతో యంత్రాల ద్వారా నెలసరి ఆఖరిలో కార్మికుల ఖాతాలలో కార్య ఫలితం తక్కువగా వేసేస్తారు ఆపైన మరచిపోతారు వారి జీవితాల అభివృద్ధిని చూసుకుంటారు
శ్రామికులను గొప్పవారిగా చూసే అధికారం ఇంకా మానవత్వంతో జన్మించలేదు మేధస్సులో ఆలోచన కలగలేదు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion