ఈ రోజు చేసిన కార్యముల కన్నా ఈ రోజు మరచిపోయిన కార్యములే ప్రధానమైనవి
మరచిపోయిన కార్యములనే ఎవరైనా పూర్తి చేశావా అని ఎప్పుడైనా అడగవచ్చు
చేసిన కార్యాలను అడగడం తక్కువ చేయలేని కార్యాలను ప్రశ్నించడం ఎక్కువ
తొమ్మిది కార్యాలను శ్రమించి నైపుణ్యంతో చేసినా చేయలేని ఒక కార్యాన్ని అడుగుతూ ఉంటారు
చేసిన కార్యముల కన్నా చేయలేని కార్యములను ప్రశ్నించినప్పుడే దేహం సంకోచిస్తుంది శరీరం అసంతృప్తి చెందుతుంది మేధస్సు ఉత్తేజాన్ని కోల్పోతుంది మనస్సు ప్రోత్సాహాన్ని వదిలేస్తుంది
ప్రతి కార్యాన్ని మరచిపోకుండా చేయాలంటే ప్రతి రోజు ప్రతి కార్యాన్ని గమనంతో ఎప్పటికప్పుడు ఎప్పుడు ఆలోచన కలిగిన ఎప్పడు గుర్తుకు వచ్చినా ఎవరు ఎప్పుడు చెప్పినా వెంటనే వ్రాసుకోవాలి గంటకు ఒకసారి చూసుకొని ప్రతి కార్యాన్ని ముగిస్తూ సాగిపోవాలి
ఒక వేళ ఆ రోజులో చేయలేకపోతే మరసటి రోజు వెంటనే చేయాలి ఎవరూ ప్రశ్నించక ముందే త్వరగా ముగించాలి
ప్రతి రోజు ప్రతి కార్యాన్ని గమనంతో వ్రాసుకుంటూ ఎప్పటికప్పుడూ చేసుకుంటూ ప్రతి కార్యాన్ని సరైన రీతిలో ముగిస్తూ సాగిపోవాలి
ఏదైనా నేర్చుకోవడం చదువుకోవడం మాట్లాడటం కూడా ఇలాగే గమనంతో వ్రాసుకుంటూ చేసుకోవాలి సరైన సమయానికి సిద్ధంగా ఫలితంగా జ్ఞాపకంగా పరిపూర్ణంగా ప్రయోజనకరంగా ఉండాలి
చేసే కార్యాలలో కూడా ముఖ్యమైన వాటిని అవసరమైన వాటిని త్వరగా ముగించాలి ఆ తర్వాత మిగిలిన వాటిని చేసుకుంటూ సాగిపోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion