వంట పాత్రలు ఎంతటి పరిశుద్ధంగా ఉంటే ఆహారం అంతటి ఆరోగ్యంగా మధురంగా ఉంటుంది
వంట పాత్రలు అలాగే వాటిని వండే (ఆహారం తయారు చేసే ప్రదేశం) ప్రాంతం వాటిని ఉంచే ప్రాంతం పరిశుద్ధంగా ఉండాలి అలాగే ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తూ చక్కగా అమర్చుకోవాలి
వంట పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడం చాలా గొప్ప కార్యం పరిశుద్ధమైన ప్రభావితం ఆరోగ్యకరం
ఆహార పదార్థాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి అలాగే ఆహారాన్ని పరిశుద్ధంగా తయారుచేయాలి
ఆహారాన్ని తయారు చేసే వారికి ముఖ్యంగా ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు ఒక వేళ ఉంటే ఆహారం పవిత్రంగా ఉండదు
ఆహారాన్ని తయారు చేసేటప్పుడు రుచించకుండా రుచిగా తయారు చేయడమే నైపుణ్యమైన గొప్ప కార్యం పవిత్రమైన పరిశుద్ధమైన ఆహారం ఆరోగ్యానికి అవసరం సామర్థ్యం మధురమైన భోజనం దేహానికి సంతృప్తికరం
నాణ్యతమైన పరిశుద్ధమైన తాజా పదార్థాల ఆహారం ప్రతి రోజు ప్రతి పూట సమపాలలో ఆస్వాదిస్తే ఆయుస్సు పెరుగుతుంది మేధస్సులో ఆలోచనలు ఉత్తేజంగా ఉంటాయి శరీరం సామర్థ్యంగా ఆరోగ్యంగా శ్రమిస్తూ చాలా సమయం సాగిపోతుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion