ఒకరితో నిరాశ మరొకరితో అత్యాశ ఇంకొకరితో సరి ఆశ
ఈ రోజు నిరాశ మరో రోజు అత్యాశ ఇంకో రోజు సరైన ఆశ
ఆశతో ఉన్నప్పుడు ఆలోచనతో ఉండాలి
నిరాశతో ఉన్నప్పుడు అనుభవంతో ఉండాలి
అత్యాశతో ఉన్నప్పుడు అవగాహనతో ఉండాలి
ఆశ బాధ్యతతో ఉండవచ్చు
నిరాశ నిర్లక్ష్యంతో ఉండవచ్చు
అత్యాశ ఆత్రుతతో ఉండవచ్చు
ఆశతో ఉండడం కన్నా గమనంతో ఉంటేనే కార్య ఫలితం ఉంటుంది
నిరాశతో ఉండడం కన్నా శ్రమించడంతో ఉంటేనే కార్య సాధన సాగుతుంది
అత్యాశతో ఉండడం కన్నా పరిశోధనతో ఉంటేనే కార్యాచరణ తెలుస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion