కుళ్ళిపోయిన పదార్థాల వలన ప్రాణవాయువు విషవాయుగా మారిపోతూ అనారోగ్యాన్ని కలిగిస్తుంది
కుళ్ళిపోయిన అనేక రకాల పదార్థాల వలన వివిధ రకాల వస్తువుల వలన ప్రాణవాయువు విషవాయువుగా మారుతూ సుగంధమైన పరిమళమైన పర్యావరణం కూడా దుర్గంధమై ప్రమాదకరమైన అనారోగ్యాన్ని అస్థవ్యవస్థను కలిగిస్తుంది వాతావరణాన్ని కాలుష్యంగా మారుస్తుంది
వస్తువులను పదార్థాలను చాలా పరిశుద్ధంగా ఉపయోగించుకోవాలి ప్రతి కార్యాన్ని పరిశుద్ధంగా చేస్తూ సాగిపోవాలి
ప్రతి రోజు కలిగే వ్యర్థాలను సరైన రీతిలో సరైన ప్రదేశానికి (సమాజానికి దూరంగా) సరైన విధంగా తరలించాలి
ప్రతి అణువును ప్రతి ప్రదేశాన్ని సూక్ష్మంగా మహా రూపంగా ఎప్పటికీ పరిశుద్ధంగా పర్యావరణంగా ఉంచుకోవాలి
ప్రాణవాయువు చాలా ప్రమాదకరమైన విషవాయువుగా మారితే మళ్ళీ దానిని పరిశుద్ధంగా మార్చుటకు కొన్ని మాసాలు (నెలలు) లేదా కొన్ని సంవత్సరాలు కూడా పట్టవచ్చు
విషవాయువు వలన జీవించుటకు ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఏర్పడవచ్చు ఆహారం కూడా ప్రమాదకరంగా మారిపోవచ్చు మానవుని శక్తి సామర్థ్యాలు శ్రమించే సహనత్త్వం తగ్గిపోవచ్చు అనారోగ్యంతో మరణించవచ్చు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion