నెలసరి దినసరి సరాసరి - జీవితం దినసరిగా సాగుతూ నెలసరిగా సరాసరి అవుతున్నది
నెలసరి ఆదాయం అంతా దినసరి ఖర్చులతో సాగుతూ నెల ఆఖరితో మొత్తం ఖాళీ అవుతున్నది
ఆదాయం ఎంతో ఖర్చు అంతే ఉన్నది అంతకంటే ఎక్కువగా ఉన్నది
ఆదాయం పెరగకున్నా ఖర్చులు మాత్రం అధికంగా పెరుగుతూనే ఉన్నాయి
ఆదాయం సంవత్సరానికి కొంతగా పెరుగుతున్నా ఖర్చులు ధరలు మాత్రం నెల నెలకు పెరుగుతూనే ఉంటాయి
కొందరికి దశాబ్దాలుగా ఆదాయం పెరగకున్నా ఖర్చులు ధరలు మాత్రం విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి
కనీస అవసరాలకు ఆహార పదార్థాలకు ధరలు అధికంగా నెల నెలకు పెరుగుతూనే ఉన్నాయి
ఇంటి అద్దె కడుతూ వస్తువుల ఆహార పదార్థాల ధరలను ఖర్చులుగా చేసుకుంటూ జీవించడం కఠినంగా మారుతున్నది
ఇంటి అద్దెలు కూడా ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నారు జీవించడానికి వీలు లేకుండా చేస్తున్నారు
సమాజంలో ఎవరు వీటిని పట్టించుకుంటారో ఎవరు మానవత్వంతో దయ చూపిస్తారో తెలియుట లేదు
--వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
Reveal your opinion